Share News

Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!

ABN , Publish Date - Jun 14 , 2024 | 08:42 AM

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్(heat wave) అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షం కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ అలాగే కొనసాగుతుందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Rain Alert: బాబోయ్.. ఇటు ఎండలు.. అటు నాలుగు రోజులపాటు వర్షాలు!
Rains for 4 days from june 14th 2024

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్(heat wave) అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ(delhi) నుంచి రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే శుక్రవారం జూన్ 14న ఢిల్లీ ప్రజలు మండుతున్న వేడి నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. ఢిల్లీలో ఈరోజు తేలికపాటి వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.


ఈ క్రమంలో రానున్న 4 రోజుల పాటు తూర్పు, వాయువ్య భారతదేశంలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మహారాష్ట్ర, గోవా, తెలంగాణ(telangana), కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఉంటాయని వెల్లడించింది. రానున్న మూడు రోజుల్లో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే జూన్ 17 వరకు అసోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.


స్కైమెట్ వెదర్ ప్రకారం రాబోయే 24 గంటల్లో, కొంకణ్, గోవా, కర్ణాటక, తెలంగాణ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశాలో భారీ వర్షాలతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, కర్ణాటక, ఈశాన్య భారతదేశం, నైరుతి మధ్యప్రదేశ్, దక్షిణ గుజరాత్, జమ్మూ కాశ్మీర్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందకపోతే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 17 వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.


ఇది కూడా చదవండి:

Kuwait Fire: 45 మంది భారతీయుల మృతదేహాలతో కొచ్చికి బయలుదేరిన IAF విమానం


Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ

అదానీ గూటికి పెన్నా సిమెంట్‌


Read Latest National News and Telugu News

Updated Date - Jun 14 , 2024 | 09:32 AM