Sadhguru: సద్గురు మెదడులో రక్తస్రావం ఎందుకు జరిగింది..? కారణాలు, లక్షణాలు ఏంటీ..?
ABN , Publish Date - Mar 21 , 2024 | 07:15 PM
మెదడులో రక్త స్రావం ఎందుకు జరుగుతుందనే అంశాన్ని డాకర్ట్ వినిత్ సూరి వివరించారు. ‘తీవ్రమైన తలనొప్పి ఉంటే చెక్ చేయించుకోవాలి. ఒక్కసారిగా బలహీనంగా అవడం. తిమ్మిరి రావడం. మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం. కంటి చూపు సమస్య ఏర్పడటం. అర్థం చేసుకోకపోవడం, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అని’ డాక్టర్ వినిత్ సూరి వివరించారు. ఇందులో ఏ లక్షణం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఢిల్లీ: ప్రముఖ ఆధ్మాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadhguru Jaggi Vasudev) మెదడులో రక్తస్రావం జరగడంతో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటే జగ్గీ వాసుదేవ్ (Jaggi Vasudev) మెదడులో రక్తస్రావం ఎందుకు అయ్యింది. అసలు ఎందుకు అలా జరిగింది. మెదడులో రక్తస్రావం అయితే లక్షణాలు ఎలా ఉంటాయి..? రక్తస్రావం జరిగితే చికిత్స ఎలా ఇస్తారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు ప్రతి ఒక్కరి మెదడును తొలచి వేస్తున్నాయి.
బ్రెయిన్ హెమరేజ్
‘మెదడులో జరిగే రక్తస్రావాన్ని బ్రెయిన్ హెమరేజ్ అని కూడా పిలుస్తారు. గాయం వల్ల మెదడులో రక్తస్రావం జరగొచ్చు. హై బీపీ వల్ల కూడా రక్తస్రావం జరిగేందుకు ఆస్కారం ఉంది. రక్తనాళాల్లో తేడా వల్ల జరిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య పరిస్థితులు, మందుల వల్ల మెదడులో రక్తస్రావం జరిగే ఛాన్స్ ఉంది అని’ జగ్గీ వాసుదేవ్‌కు సర్జరీ చేసిన డాక్టర్ వినిత్ సూరి తెలిపారు.
లక్షణాలు
మెదడులో రక్త స్రావం ఎందుకు జరుగుతుందనే అంశాన్ని డాకర్ట్ వినిత్ సూరి వివరించారు. ‘తీవ్రమైన తలనొప్పి ఉంటే చెక్ చేయించుకోవాలి. ఒక్కసారిగా బలహీనంగా అవడం. తిమ్మిరి రావడం. మాట్లాడటం లేదంటే అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం. కంటి చూపు సమస్య ఏర్పడటం. అర్థం చేసుకోకపోవడం, ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లే అవకాశం ఉంది అని’ డాక్టర్ వినిత్ సూరి వివరించారు. ఇందులో ఏ లక్షణం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
చికిత్స
మెదడులో రక్తస్రావం జరిగితే వైద్యులు సర్జరీ చేస్తారు. వయస్సు, కొలుకునే తీరును బట్టి శస్త్ర చికిత్సకు ప్రిఫర్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో క్రానియోటమీ (పుర్రెలో కొంత భాగం తొలగిస్తారు.) ఇన్వాసిస్ విధానాల ద్వారా కూడా చికిత్స అందిస్తారు. మరికొన్ని సందర్భాల్లో మందులు, థెరపీ ద్వారా రక్తస్రావం తగ్గించే ప్రయత్నం చేస్తుంటారు. రోగి వయస్సు, బీపీ, షుగర్ ఉంటే కంట్రోల్ చేసి చికిత్స అందిస్తారు.
రికవరీ
మెదడుకు శస్త్రచికిత్స జరిగిన తర్వాత కోలుకోవడం అంటే సవాలుతో కూడుకున్న సుధీర్ఘమైన ప్రక్రియ. రోగి కోలుకునేందుకు వైద్యుల చికిత్స, కుటుంబ సభ్యులు అండగా ఉండటం, స్నేహితులు మనోధైర్యం కల్పించడం, ఓపికగా కోలుకునే వరకు వేచి చూస్తే క్రమంగా కోలుకుంటారు. ఫిజికల్ థెరపీ, అక్యుపెసనల్ థెరపీ, స్పీచ్ థెరపీ, వ్యాయామం చేయాలి. ఇలా చేయడంతో రోగి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది.
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
Viral video: ప్రమాదం పొంచి ఉండడం అంటే ఇదేనేమో.. గోడౌన్‌లో మహిళ శుభ్రం చేస్తుండగా ఉన్నట్టుండి..