BMC elctions: బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన సోలో ఫైట్
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:31 PM
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని సంజయ్ రౌత్ చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
ముంబై: మహారాష్ట్రలోని 'మహా వికాస్ అఘాడి' (MVA)లో లుకలుకలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతున్న క్రమంలో బ్రిహాన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలపై శివసేన (UBT) కీలక సంకేతాలు ఇచ్చింది. బీఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా (Solo) పోటీ చేసే అవకాశం ఉందని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) శనివారంనాడు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పొత్తుల్లేకుండా వెళ్లాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారని, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కంటే స్థానిక సంస్థల్లో పోటీకి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారని చెప్పారు. బీజేపీతో అవిభక్త శివసేన పొత్తు ఉన్నప్పుడు కూడా బీఎంసీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో తమ పార్టీ స్వతంత్రంగానే పోటీ చేసిందని గుర్తుచేశారు.
Arvind Kejriwal: అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం
''బీఎంసీ ఎన్నికల కోసం (ఒంటరిగా పోటీకి వెళ్లడంపై) ఉద్ధవ్ థాకరే, ఇతర పార్టీ నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. సోలోగా ఎన్నికలకు వెళ్లాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు" అని సంజయ్ రౌత్ తెలిపారు. ఆర్థికంగా గట్టి సత్తా ఉన్న బీఎంసీ 1997 నుంచి 2022 వరకూ అవిభక్త శివసేన చేతుల్లోనే ఉంది. బీఎంసీకి గతంలో ఎన్నికైన ప్రతినిధుల పదవీకాలం 2022 మార్చితో ముగిసింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.
ముంబైలో గెలుపు సాధించాల్సిందే..
ముంబైలో తమ పార్టీకి గట్టి బలం ఉందని, ముంబై నుంచి పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని సీట్లు తమకు ఇచ్చుంటే వాటిని గెలిచేవాళ్లమని సంజయ్ రౌత్ అన్నారు. ముంబైలో పార్టీ గెలుపు అనివార్యమని, లేదంటే ముంబై సిటీని మహారాష్ట్ర నుంచి వేరుచేయవచ్చని చెప్పారు. ముంబైలో శివసేన 24 సీట్లలో (అసెంబ్లీ) పోటీ చేయగా 10 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 10 స్థానాల్లో పోటీ చేసి 4 చోట్ల గెలిచింది. ఎన్‌సీపీ (ఎస్‌పీ) రెండు చోట్ల పోటీ చేసి రెండూ ఓడిపోయింది.
ఇవి కూాడా చదవండి..
Bangalore: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం..
Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి
Read More National News and Latest Telugu News