Share News

LokSabha Elections: ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు..

ABN , Publish Date - May 03 , 2024 | 02:48 PM

అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆమె మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగడం.. అమేఠీ ప్రజల విజయమని ఆమె అభివర్ణించారు.

LokSabha Elections: ఎన్నికలకు ముందే ఓటమి ఒప్పుకున్నారు..
Smriti Irani

న్యూఢిల్లీ, ఏప్రిల్ 03: అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిషోరీ లాల్ శర్మ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ వ్యంగ్య బాణాలు సంధించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆమె మాట్లాడుతూ.. రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల బరిలో దిగడం.. అమేఠీ ప్రజల విజయమని ఆమె అభివర్ణించారు.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో... ఎన్నికలు జరగక ముందే అమేఠీ నియోజకవర్గంలో ఆయనకు ఓటమి తప్పదనే విషయాన్ని.. కాంగ్రెస్ పార్టీ ఒప్పకున్నట్లు అయిందన్నారు. అందుకే గాంధీ కుటుంబంలో ఏ ఒక్కరు అమేఠీ నుంచి బరిలో దిగలేదని స్మృతీ ఇరానీ ఈ సందర్బంగా పేర్కొన్నారు.

Helicopter: ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన హెలికాప్టర్.. కీలక నేతకు..


కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీకి.. ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం సరిపోలేదన్నారు. అందుకే ఆమె రాజస్థాన్ నుంచి రాజ్యసభ‌కు వెళ్లారని చెప్పారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంట్‌లో ప్రస్తావించిన విషయాన్ని స్మృతీ ఇరానీ గుర్తు చేశారు.

AP Elections: మైలవరంలో వైసీపీ మరో షాక్.. పార్టీని వీడిన ఎంపీపీ

ఇక ఇప్పటికే వాయనాడ్‌లో పోలింగ్ పూర్తైందని.. అయితే ఆ స్థానం నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీలోని కీలక నేత రాహుల్ గాంధీకి ఓటమి తప్పదనే విషయం ఆయనకు బాగా అర్థమైందన్నారు. అందుకే మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగాలని నిర్ణయించుకున్నారని... ఆ క్రమంలో అమేఠీ వదిలి రాయ్‌బరేలీని ఎంచుకున్నారని స్మృతీ ఇరానీ వివరించారు.


మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని స్మృతీ ఇరానీ ధీమా వ్యక్తం చేశారు. తద్వారా మోదీ ప్రభుత్వం అమేఠీ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతామని స్పష్టం చేశారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుందని తెలిసే.. రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్‌బరేలీకి పరిగెత్తారని ఆమె వ్యంగ్యంగా అన్నారు.

ABN Effect: ఆంధ్రజ్యోతి దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం

అయితే ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా స్మృతీ ఇరానీ బరిలో దిగారు. గత ఎన్నికల్లో అంటే... 2019లో అమేఠీ నుంచి స్మృతీ ఇరానీ పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆమె చేతిలో రాహుల్ గాంధీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ నాయకుడు దినేష్ ప్రతాప్‌ సింగ్ బరిలో నిలిచారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 03 , 2024 | 02:48 PM