Share News

Son kill Mother: తల్లిని చంపి ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్..

ABN , Publish Date - Aug 31 , 2024 | 08:58 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన తల్లిని చంపి ఆమె మృతదేహంతో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితున్ని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Son kill Mother: తల్లిని చంపి ఆపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్..

గుజరాత్‌: రాజ్‌కోట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ యువకుడు తన తల్లిని చంపి ఆమె మృతదేహంతో ఫొటో దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుణ్ని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


అసలేం జరిగిందంటే?

రాజ్‌కోట్‌కు చెందిన జ్యోతిబెన్‌కు ఓ వ్యక్తితో 25 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె 20సంవత్సరాలుగా పెద్దకుమారుడు నీలేశ్‌తో కలిసి స్థానికంగా నివాసం ఉంటోంది. నిన్న రాత్రి (శుక్రవారం) తల్లి, కుమారుడికి మధ్య జరిగిన వాగ్వాదం ఆమె ప్రాణాలను తీసింది.


జ్యోతిబెన్ మానసిక ఆనారోగ్యంతో బాధపడుతోంది. కొన్నేళ్లుగా మానసిన వైద్యుల వద్ద ఆమె చికిత్స తీసుకుంటుంది. జ్యోతిబెన్ తరచూ కుమారుడు నీలేశ్‌తో గొడపడేది. వారి మధ్య తరచూ భౌతికదాడులు కూడా జరిగేవి. గత నెల రోజులుగా ఆమె మందులు వాడడం మానేసింది. దీంతో ఆమె పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో రాజ్‌కోట్‌లోని యూనివర్శిటీ రోడ్‌లోని భగత్‌సిన్హ్‌జీ గార్డెన్‌లో తల్లీకుమారుడు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో యువకుడు కత్తితో తల్లిపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించి అతని వద్ద నుంచి కత్తి లాక్కుంది. తీవ్ర కోపోద్రిక్తుడైన నీలేశ్ తన వద్ద ఉన్న దుప్పటిని ఆమె గొంతుకు బిగ్గించి చంపేశాడు.


అనంతరం తల్లి మృతదేహంతో ఫొటోలు దిగాడు. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. "సారీ అమ్మ నేను నిన్ను చంపేశా. నేను నిన్ను కోల్పోయా, ఓం శాంతి" అని ఒక పోస్టు.. "ఐయామ్ కిల్ మై మమ్, లాస్ మై లైఫ్, సారీ మామ్, ఓం శాంతి, మిస్ యూ మామ్" అంటూ మరో పోస్టు పెట్టాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. వారు వచ్చే సరికే నీలేశ్ తల్లి మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.


తల్లి జ్యోతిబెన్‍ను తానే చంపినట్లు నిందితుడు నీలేశ్ విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతన్ని రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు మాత్రం భర్త, పిల్లలు ఒప్పుకోలేదని పోలీసులు వెల్లడించారు.

Updated Date - Aug 31 , 2024 | 09:06 AM