Share News

2న విచారణకు రాహుల్‌ రావాలి: యూపీ కోర్టు

ABN , Publish Date - Jun 27 , 2024 | 04:33 AM

పరువు నష్టం దావాలో వచ్చే నెల రెండో తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్థానిక ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఆదేశించింది.

2న విచారణకు రాహుల్‌ రావాలి: యూపీ కోర్టు

సుల్తాన్‌పూర్‌ (యూపీ), జూన్‌ 26: పరువు నష్టం దావాలో వచ్చే నెల రెండో తేదీన విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని స్థానిక ఎంపీ/ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఆదేశించింది. కేంద్ర మంత్రి అమిత్‌ షాపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నాయకుడు విజయ్‌ మిశ్ర 2018లో ఈ దావా వేశారు.

బుధవారం ఈ కేసు విచారణకు రాగా ఇందులో తనను పార్టీగా చేర్చుకోవాలంటూ రామ్‌ ప్రతాప్‌ అనే వ్యక్తి కోర్టును అభ్యర్థించారు. ఇందుకు ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఆయన బాధితుడు కాడని, ఈ కేసులో ఆయనకు సంబంధమేమీ లేదని చెప్పారు. రాహుల్‌ తరఫు న్యాయవాది కూడా అభ్యంతరం చెప్పారు. వాదనలు విన్న జడ్జి రామ్‌ ప్రతాప్‌ పిటిషన్‌ను తిరస్కరించారు. రాహుల్‌ మాత్రం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఫిబ్రవరి 20న కూడా రాహుల్‌ కోర్టుకు వచ్చారు.

Updated Date - Jun 27 , 2024 | 07:16 AM