Share News

Madhya Pradesh: ఘోర ప్రమాదం.. ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడూ చూసుండరు..

ABN , Publish Date - Nov 24 , 2024 | 05:00 PM

గ్వాలియర్‌లోని హజీరా జాతీ లైన్‌ ప్రాంతానికి చెందిన భవిష్య(14) అనే బాలుడు స్థానిక బీటీఐ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం పాఠశాల అనంతరం తన స్నేహితుడిని ఇంటి వద్ద దింపేందుకు భవిష్య నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి సైకిల్‌పై ఏఆర్పీ కాలనీకి బయలుదేరారు.

Madhya Pradesh: ఘోర ప్రమాదం.. ఇలాంటి యాక్సిడెంట్ ఎప్పుడూ చూసుండరు..

ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డ్రైవర్ అశ్రద్ధ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అతని నిర్లక్ష్యం కారణంగా ఓ బాలుడు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. స్థానికులు అరుస్తున్నప్పటికీ పట్టించుకోని డ్రైవర్.. బస్సును నిర్లక్ష్యంగా నడిపాడు. ఏకంగా బాలుడి పైనుంచి బస్సు నడిపి మృతిచెందేందుకు కారణం అయ్యాడు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


గ్వాలియర్‌లోని హజీరా జాతీ లైన్‌ ప్రాంతానికి చెందిన భవిష్య(14) అనే బాలుడు స్థానిక బీటీఐ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం పాఠశాల అనంతరం తన స్నేహితుడిని ఇంటి వద్ద దింపేందుకు భవిష్య నిర్ణయించుకున్నాడు. అనంతరం ఇద్దరూ కలిసి సైకిల్‌పై ఏఆర్పీ కాలనీకి బయలుదేరారు. రోడ్డుపై విపరీతమైన ట్రాఫిక్ ఉండడంతో వారిద్దరూ మెల్లిగా వెళ్తున్నారు. అయితే ఓ కూడలి వద్ద ఎడమ వైపునకు వెళ్లేందుకు డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. అనంతరం బస్సు పక్క నుంచి మూడు ద్విచక్రవాహనాలు వరకూ ముందుకు వెళ్లిపోయాయి. అయితే ఎడమ వైపునకు టర్న్ తీసుకునేందుకు బస్సు పక్కనే భవిష్య, అతని స్నేహితుడు ఆగారు.


వాహనాలు వెళ్లిపోయిన తర్వాత వెంటనే బస్సు డ్రైవర్ ఎడమవైపు టర్న్ తీసుకున్నాడు. అయితే తమపైకి బస్సు రావడంతో తప్పించుకునేందుకు ఇద్దరు విద్యార్థులు ప్రయత్నించారు. అయినప్పటికీ వారిని గమనించని డ్రైవర్ ముందుకు వెళ్లాడు. సైకిల్ వెనకాల కూర్చున్న బాలుడు కిందకు దిగిపోగా.. భవిష్య మాత్రం తప్పించుకునేందుకు వీలులేకుండా పోయింది. దీంతో అతన్ని బస్సు డ్రైవర్ 10మీటర్లు మీర లాక్కెళ్లిపోయాడు. అనంతరం అతని పైనుంచి బస్సును నడిపించాడు. ప్రమాదంలో విద్యార్థి భవిష్యకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే అప్పటికే ప్రమాదాన్ని గమనిస్తున్న స్థానికులు గట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు.


అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ప్రమాదం జరిగిందని తెలుసుకుని అక్కడ్నుంచి పారిపోయాడు. దీంతో స్థానికులు భవిష్యను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి బాలుడి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మెుత్తం ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే భవిష్య చికిత్సపొందుతూ మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి మృతితో బాధిత కుటుంబం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Elections: అత్యధిక, అత్యల్ప మెజార్టీలు ఇవే.. మహా ఓటరు తీర్పులో ఎన్నో ట్విస్టులు..

Chief Minister: మేం.. ప్రజాకోర్టులో గెలిచాం..

Updated Date - Nov 24 , 2024 | 05:02 PM