Share News

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..

ABN , Publish Date - May 10 , 2024 | 02:22 PM

Bail to Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

Kejriwal Bail: కేజ్రీవాల్‌కు ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు..
Bail to Kejriwal

Bail to Kejriwal: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. కేజ్రీవాల్‌కు అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.


అయితే, లిక్కర్ కేసు గురుంచి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని ఈడీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. మీరు కూడా అంతకంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్‌కు జూన్ 4వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీంకోర్టు తీరస్కరించింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

For More National News and Telugu News..

Updated Date - May 10 , 2024 | 02:41 PM