Share News

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

ABN , Publish Date - Jul 13 , 2024 | 05:22 AM

కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విఽధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది.

Supreme Court : అసాధారణ సందర్భాల్లోనే బెయిల్‌పై స్టే ఇవ్వాలి

  • లేకుంటే ప్రమాదంలో వ్యక్తిగత స్వేచ్ఛ: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూలై 12: కింది కోర్టులు మంజూరు చేసిన బెయిల్‌ ఉత్తర్వులపై స్టే విధించేటప్పుడు పైకోర్టులు యాంత్రికంగా వ్యవహరించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సరైన కారణాలు చెప్పకుండా స్టే ఇవ్వకూడదని తెలిపింది. అసాధారణ, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే స్టే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది.

ఉగ్రవాదుల కేసుల్లో చట్టాన్ని పాటించలేదని భావించే సందర్భాల్లో మాత్రమే బెయిల్‌పై స్టే ఇవ్వవచ్చని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసి్‌షల ధర్మాసనం తన ఆదేశాల్లో పేర్కొంది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణపై పర్వీందర్‌ సింగ్‌ ఖురానా అనే వ్యక్తిపై కేసు నమోదయింది.

ఆయనకు గత ఏడాది జూన్‌ 17న ట్రయల్‌ కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై హైకోర్టు మధ్యంతర స్టే ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన ధర్మాసనం..నిందితుడు ఉగ్రవాది కాదని, బెయిల్‌పై స్టే ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. ఇలా స్టే ఇవ్వడం ప్రమాదకరమని, అది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని తెలిపింది. యథాలాపంగా వ్యవహరిస్తూ వ్యక్తుల స్వేచ్ఛపై ఆంక్షలు పెట్టకూడదని పేర్కొంది.

Updated Date - Jul 13 , 2024 | 05:22 AM