Teacher: టీచర్ నోటి దురుసు.. సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 25 , 2024 | 09:56 AM
రాజస్థాన్‌లో ఓ మహిళ ఉపాధ్యాయురాలు అతిగా ప్రవర్తించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి పట్ల అనుచితంగా బిహేవ్ చేశారు. ఈ పాఠశాలకు సరస్వతీ ఏం చేశారు..? విద్య కోసం ఏం చేశారని తన నోటి దూలను ప్రదర్శించారు.
జైపూర్: రాజస్థాన్‌లో (Rajasthan) ఓ మహిళ ఉపాధ్యాయురాలు (Teacher) అతిగా ప్రవర్తించారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా చదువుల తల్లి సరస్వతీ దేవి పట్ల అనుచితంగా బిహేవ్ చేశారు. ఈ పాఠశాలకు సరస్వతీ ఏం చేశారు..? విద్య కోసం ఏం చేశారని తన నోటి దూలను ప్రదర్శించారు. ఘటనను సీరియస్‌గా తీసుకొని క్రమశిక్షణ కమిటీ వేశారు. కమిటీ సిఫారసుతో ఆ లేడీ టీచర్‌పై సస్పెండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Fastag: KYC అప్‌డేట్ పేరుతో కొత్త స్కాం.. జర జాగ్రత్త!
ఏం జరిగిందంటే..?
బరాన్ జిల్లా లకాడియాలో గల కిషన్ గంజ్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. హేమలతా భైర్వ అనే మహిళా ఉపాధ్యాయురాలు పనిచేస్తున్నారు. గణతంత్ర దినోవ్సతం సందర్భంగా స్టేజీ మీద జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలను ఏర్పాటు చేశారు. వారి చిత్రాల వద్ద సరస్వతీ దేవి ఫొటో పెడుతుండగా టీచర్ హేమలత అడ్డుకున్నారు. సరస్వతీ దేవి విద్య కోసం ఏం చేశారని ప్రశ్నించారు.
టీచర్ సస్పెండ్
టీచర్ హేమలతా తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. దాంతో క్రమశిక్షణ కమిటీ వేశారు. టీచర్ హేమలతపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. హేమలతను విధుల నుంచి తప్పించారు. ‘చదువుల తల్లి సరస్వతీని టీచర్ హేమలత అవమానించారు. సరస్వతీ మాతను హేమలత గౌరవించలేదు. హిందువుల దేవత పట్ల చులకన భావంతో మాట్లాడారు. అందుకే హేమలతపై చర్యలు తీసుకున్నాం అని’ రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.