Elections 2024: 12వ తరగతి అయిపోతే చాలు.. ఓటరు కార్డు పొందవచ్చు.. పూర్తి వివరాలివే..
ABN , Publish Date - Mar 16 , 2024 | 09:07 PM
సాధారణంగా మన దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే విద్యార్థులకు ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
సాధారణంగా మన దేశంలో 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. అయితే విద్యార్థులకు ఓటరు గుర్తింపు కార్డులు ఇచ్చే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. 18 ఏళ్లు నిండిన విద్యార్థులు ఆటోమేటిక్‌గా ఓటరు కార్డులు పొందవచ్చని వెల్లడించింది. 12వ తరగతి విద్యార్థులు తమ ఓటు ( Vote ) హక్కును వినియోగించుకునేందుకు ఓటరు ఐడీలను అందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని భారత ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకు గానూ అడ్వాన్స్‌డ్ దరఖాస్తులతో కూడిన వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.
ఓటరు కార్డు అనేది భారత ఎన్నికల సంఘం ద్వారా ఓటర్లకు జారీ చేసిన ముఖ్యమైన గుర్తింపు పత్రం. అంతే కాకుండా పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకునేటప్పుడు దీనిని తప్పనిసరిగా కలిగి ఉండాలి. కాగా.. దాదాపు ఏడాది కాలంగా హింస చెలరేగిన మణిపూర్‌లో ఉన్న ప్రభావిత ఓటర్లు తమ శిబిరాల నుంచే ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియలో 543 మంది ఎంపీలను ఎన్నుకునేందుకు 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1.8 కోట్ల మంది మొదటి సారి తమ ఓటు వేస్తున్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.