National : గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీ విడుదలపై సుప్రీం స్టే
ABN , Publish Date - Jun 04 , 2024 | 03:43 AM
హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-పోలిటీషియన్ అరుణ్ గావ్లీని ముందస్తుగా విడుదల చేయడంపై స్టే విధిస్తూ సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ గావ్లీ పెటుకున్న దరఖాస్తును పరిశీలించాలంటూ ఏప్రిల్ 5న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.
న్యూఢిల్లీ, జూన్ 3: హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్-పోలిటీషియన్ అరుణ్ గావ్లీని ముందస్తుగా విడుదల చేయడంపై స్టే విధిస్తూ సోమవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తనను ముందస్తుగా విడుదల చేయాలంటూ గావ్లీ పెటుకున్న దరఖాస్తును పరిశీలించాలంటూ ఏప్రిల్ 5న బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చింది.
2006లో శివసేన కార్పొరేటర్ కమలాకర్ జామసండేకర్‌ను హత్య చేసిన కేసులో గావ్లీకి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.17 లక్షల జరిమానా విధిస్తూ ముంబయిలోని సెషన్స్ కోర్టు 2012లో తీర్పు చెప్పింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.
వయసు 65 ఏళ్లు దాటడం, శారీరకంగా బలహీనపడడంతో 2006 రెమిషన్ పాలసీ ప్రకారం ముందస్తుగా విడుదల చేయాలని గావ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. కానీ, గావ్లీ దరఖాస్తును పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా స్టే ఇచ్చింది. గావ్లీ 2004-09 మధ్య ముంబయిలోని చించ్‌పోక్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు.