Share News

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:10 AM

భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్‌ 737 మోడల్‌ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది.

బోయింగ్‌ 737 రడ్డర్లలో సమస్య

  • అన్ని మోడళ్లలోనూ ఇబ్బంది: డీజీసీఏ

  • ప్రధాని వాడే విమానం కూడా 737

న్యూఢిల్లీ, అక్టోబరు 7: భారత్‌లోని కొన్ని వైమానిక సంస్థలు వినియోగిస్తున్న బోయింగ్‌ 737 మోడల్‌ విమానాల రడ్డర్లలో సమస్య ఉందని డీజీసీఏ హెచ్చరించింది. రడ్డర్‌ అంటే.. విమానం వెనుక భాగంలో ఉండే ఓ నియంత్రణ వ్యవస్థ. టేకాఫ్‌ అయ్యేటప్పుడు దీనిని కిందకు దించుతారు. ల్యాండ్‌ అయ్యే సమయంలో పైకి లేపుతారు. అలాగే విమానం తోక భాగంలోనూ ఉండే రడ్డర్‌.. కుడి, ఎడమ వైపునకు మళ్లేందుకు ఉపయోగపడుతుంది.

విమానం స్థిరంగా ఉంచేందుకు ఈ వ్యవస్థ పనిచేస్తుంది. కాగా, బోయింగ్‌ 737 అన్ని మోడల్స్‌లోనూ రడ్డర్‌ జామింగ్‌ ఉందని డీజీసీఏ పేర్కొంది. భద్రతా ప్రమాణాల పరీక్షలు చేయించాలని వైమానిక సంస్థలకు సూచించింది. భారత్‌లో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, స్పైస్‌ జెట్‌, ఆకాశ్‌ ఎయిర్‌లు బోయింగ్‌ 737 సిరీస్‌ విమానాలను వాడుతున్నాయి. అంతేకాక.. ప్రధాని వినిగియోగించేది కూడా ఇదే సిరీ్‌సలోనిదే. వాయుసేన, ప్రముఖుల స్వ్కాడ్రన్‌లోనూ ఈ విమానాలున్నాయి.

Updated Date - Oct 08 , 2024 | 04:10 AM