Share News

Capital Hospital : ఆస్పత్రి లిఫ్ట్‌ కూలి బాలింత మృతి

ABN , Publish Date - Dec 07 , 2024 | 04:39 AM

నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఒడిలోకి తీసుకోక ముందే ఆ తల్లి మృత్యు ఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌ మేరఠ్‌లోని క్యాపిటల్‌ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది.

Capital Hospital : ఆస్పత్రి లిఫ్ట్‌ కూలి బాలింత మృతి

లఖ్‌నవూ, డిసెంబరు 6: నవ మాసాలు మోసి కన్న బిడ్డను ఒడిలోకి తీసుకోక ముందే ఆ తల్లి మృత్యు ఒడికి చేరింది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌ మేరఠ్‌లోని క్యాపిటల్‌ ఆస్పత్రిలో శుక్రవారం జరిగింది. మేరఠ్‌కు చెందిన కరీష్మా శుక్రవారం క్యాపిటల్‌ ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత కరీష్మాను ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్‌ ద్వారా గ్రౌండ్‌లో ఫ్లోర్‌లోని వార్డుకు తరలిస్తుండగా లిఫ్ట్‌ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో కరిష్మా మృతి చెందగా.. ఇద్దరు ఆస్పత్రికి సిబ్బంది గాయాలపాలయ్యారు.

Updated Date - Dec 07 , 2024 | 04:39 AM