Share News

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర డ్యాం..

ABN , Publish Date - Jul 23 , 2024 | 12:15 PM

తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు.

Tungabhadra: నిండుకుండలా తుంగభద్ర డ్యాం..

- క్రస్ట్‌గేట్ల గుండా నదికి నీటి విడుదల

- 88.358 టీఎంసీల నిల్వ

- లక్ష క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో...

బళ్లారి(కర్ణాటక): తుంగభద్ర(Tungabhadra)కు వరదపోటు ఎక్కువ కావడంతో సోమవారం సాయంత్రం జలాశయానికి చెందిన 15,16,17 క్రస్ట్‌గేట్ల గుండా 4వేల కూసెక్కుల నీటిని నదికి వదిలారు. మూడురోజుల క్రితమే నదికి ఏ క్షణంలోనైనా వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని బోర్డు అధికారులు ప్రకటించి తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులకు అవసమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 2021 సంవత్సరంలో జలాశయం నుంచి నదికి నీరు విడుదల చేయగా, 2022 సంవత్సరంలో తుంగభద్ర డ్యామ్‌(Tungabhadra Dam) పూర్తి స్థాయిలో నిండక పోవడంతో నీరు వదలలేదు. 2023లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏడాది అనుకున్న సమయం కన్నా ముందుకుగానే డ్యామ్‌ నిండడంతో పాటు వరద పోటు ఎక్కువగా ఉన్న కారణంగా మూడు క్రస్ట్‌గేట్ల గుండా దిగువకు నీటిని వదిలారు.

ఇదికూడా చదవండి: కొత్త పథకాలు.. వేతన జీవులకు ఊరట.. బడ్జెట్‌లో ముఖ్యాంశాలు..


pandu1.2.jpg

జలాశయానికి 33 క్రస్ట్‌గేట్లు(Crustgates) ఉండగా, నీటి చేరిక ఆధారంగా మరిన్ని గేట్లు తెరిచే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. జలాశయం ఎత్తు 1633 అడుగులు కాగా ప్రస్తుతం 1628.45 అడుగుల వరకు నీరు చేరిందని, ప్రస్తుతం డ్యామ్‌లో 87.056 టీఎంసీల నీరు నిల్వ ఉండగా లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వచ్చిచేరుతోంది. జలాశయం నుంచి వివిధ కాలువలకు 7,744 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం ఇదే సయమానికి డ్యామ్‌లో 52.610 టిఎంసిల నీరు నిలువ ఉండగా, ఇన్‌ప్లో 46,605 క్యూసెక్కులు ఉన్నట్లు డ్యామ్‌ అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 12:15 PM