Share News

Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద..

ABN , Publish Date - Jun 11 , 2024 | 01:05 PM

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి.

Tungabhadra: తుంగభద్రకు పెరుగుతున్న వరద..

బళ్లారి(బెంగళూరు): కర్ణాటక, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రాష్ట్రాల జీవనాడిగా నిలిచిన తుంగభద్ర(Tungabhadra) ఇప్పుడిప్పుడే జల కళ సంతరించుకుంటోంది. రుతుపవనాల కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అఽధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ రెండు నదుల కలయికతో ఏర్పడిన తుంగభద్రలో వరద ప్రవాహం రోజు రోజుకు పెరుగుతుండంతో తుంగభద్ర జలాశయానికి జలకళ సంతరించుకోవడంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి.

ఇదికూడా చదవండి: Hero Vijay: విద్యార్థులకు రెండు విడతలుగా ప్రోత్సాహకాల పంపిణి..


గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి జలాశయానికి ముందుగానే వరద నీరు వచ్చి చేరుతోంది. ఈసారైన పంటలసాగుకు అవసరమైన సాగునీరు లభిస్తుందని ఆయకట్టు రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 1580.23 అడుగులకు చేరుకుంది. 4,817 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోందని, ప్రస్తుతం జలాశయంలో 4.58 టీఎంసీల వరద నీరు నిలువ ఉన్నట్లు జలాశయం అధికారులు తెలిపారు. గత ఏడాది ఇదే సమయంలో జలాశయానికి కేవలం 280 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరిందని బోర్డు అధికారులు తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 01:05 PM