Tungabhadra: ఉధృ‘తుంగా’.. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర
ABN , Publish Date - Jul 26 , 2024 | 12:34 PM
తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది.
- టీబీ డ్యాం 28 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదల
బళ్లారి(కర్ణాటక): తుంగభద్రమ్మ ఉగ్రరూపం దాల్చింది. కర్ణాట, ఆంధ్రప్రదేశ్(Karnataka, Andhra Pradesh) రైతుల జీవనాడి నిండుకుండలా తొణికిసలాడుతోంది. డ్యాం పైప్రాంతం నుంచి జలాశయంలోకి ఇన్‌ఫ్లో 80 వేలకు పైగా క్యూసెక్కులుగా నమోదయ్యింది. అధికారుల లెక్కల ప్రకారం సాయంత్రం 4గంటలకు జలాశయంలో 102.57టీఎంసీల నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు జలాశయానికి ఉన్న 28 క్రస్ట్ గేట్లను తెరిచారు. 20 క్రస్ట్‌గేట్లను 2అడుగులు, 8క్రస్‌గేట్లను(8 Crossgates) అడుగు తెరచి నదికి లక్ష క్యూసెక్కుల నీటిని మళ్ళించారు. ఏ క్షణమైన మరింత నీటిని నదికి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లక్ష నుండి లక్ష ఏబైవేల క్యూసెక్కుల వరకు ఏ క్షణంలోనైనా నదికి నీరు మళ్ళిస్తామని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు రాత్రి విద్యుత్ కాంతుల వెలుగులో డ్యామ్ మరింత అందంగా దర్శనమిచ్చింది.
ఇదికూడా చదవండి: శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద నీరు
నిండిన కేఆర్‌ఎస్..
- లక్ష క్యూసెక్కుల నీరు విడుదల
- బృందావన్ గార్డెన్స్ గేట్ వద్ద ఆంక్షలు
బెంగళూరు: కావేరి నదీ(Kaveri river) పరీవాహక ప్రాంతంలో ఎగువన సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణరాజసాగర్(Krishnarajasagar) జలాశయం నిండుకుండలా మారింది. కేఆర్‌ఎస్ డ్యామ్(KRS Dam)కు ఇన్‌ఫ్లో పెరిగింది. గురువారం నుంచి సుమారు లక్ష క్యూసెక్కుల మేర నీటిని విడుదల చేస్తున్నారు. డ్యామ్‌కు రెండువైపుల కాలువలనుంచి నీరు విడుదల చేస్తున్నామని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ ఇంజనీర్‌లు ప్రకటించారు. వేసవిలో దాదాపు ఎండిపోయిన స్థితిలో ఉన్న డ్యామ్‌కు ప్రస్తుతం వర్షాలతో జలకళ చేరిందన్నారు. కేఆర్‌ఎస్ డ్యామ్ గరిష్ఠ సామర్థ్యం 124 అడుగులకు 49.452 టీఎంసీలు కాగా దాదాపు చేరింది. బృందావన్ గార్డెన్స్‌కు వెళ్లే బ్రిడ్జినుంచి నీరు వెళ్తుండడంతో ఇక్కడ రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
ఇదికూడా చదవండి: క్రైం బ్రాంచ్ పోలీసులమంటూ.. రూ.22 లక్షలు కొట్టేశారు..
Read Latest Telangana News and National News