Share News

Union Budget: 2021తో పోలిస్తే 'జనగణన'కు ఈసారి పరిమిత కేటాయింపులు..

ABN , Publish Date - Jul 23 , 2024 | 09:26 PM

సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు.

Union Budget: 2021తో పోలిస్తే 'జనగణన'కు ఈసారి పరిమిత కేటాయింపులు..

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జనగణన (Population Census) ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఈ ప్రక్రియ మరింత జాప్యం జరిగే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) మంగళవారంనాడు లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25 (Union Budget 2024-25)లో జనగణన కోసం పరిమితంగానే కేటాయింపులు జరిపారు. ఇందుకోసం రూ.1,309.46 కోట్లు కేటాయించారు. 2021 నాటి కేటాయింపులతో పోలిస్తే ఈ మొత్తం తక్కువ.

Budget 2024: దిశానిర్దేశం లేని బడ్జెట్... మమత విసుర్లు


జనగణనకు 2021-22లో రూ.3,768 కోట్లను ప్రతిపాదించినప్పటికీ జనగణ దిశగా అడుగులు పడలేదు. 2023-24 బడ్జెట్‌లో 1,564 కోట్లు అనుకున్నప్పటికీ రూ.579 కోట్ల మాత్రమే కేటాయిచారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి 1.309.46 కోట్లకు పెంచారు. కోవిడ్ మహమ్మారి కారణంగా జనాభా లెక్కల సేకరణలో జాప్యం జరుగుతోందని కేంద్రం తరచు చెబుతూ వస్తోంది.


ప్రభుత్వ వైఫల్యమే: జైరామ్ రమేష్

జనాభా లెక్కల సేకరణలో జరుగుతున్న జాప్యం, ఇందుకోసం బడ్జెట్‌లో పరిమిత కేటాయింపులు జరపడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ తప్పుపట్టారు. సకాలంలో జనాభా సేకరణలో ప్రభుత్వం విఫలమవుతూ వస్తోందన్నారు. జనాభా సేకరణకు కేటాయింపులపై ఆర్థిక మంత్రి ప్రకటన నిరుత్సాహపరిచిందన్నారు. 2021లోనే జనగణన జరుగుతుందని ఆశించినప్పటికీ ఇప్పటికీ కార్యరూపంలోకి రాలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సకాలంలో జనాభా లెక్కల సేకరణ నిర్వహించడంలో ప్రభుత్వం విఫలం కావడం ఇదే ప్రథమమని అన్నారు.

Read Latest Telangana News and National News

Updated Date - Jul 23 , 2024 | 09:27 PM