Budget 2024: మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
ABN , Publish Date - Feb 01 , 2024 | 11:03 AM
మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ భవనంలో మంత్రివర్గం గురువారం ఉదయం సమావేశమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించే బడ్జెట్‌కు ఏక వ్యాఖ్యంలో ఆమోందించింది.
ఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర మంత్రివర్గం (Union Cabinet) ఆమోదం తెలిపింది. పార్లమెంట్ భవనంలో మంత్రివర్గం గురువారం ఉదయం సమావేశమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించే బడ్జెట్‌కు ఏక వ్యాఖ్యంలో ఆమోందించింది. 11 గంటలకు లోక్ సభలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదిస్తారు. మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు అధిక కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని నిర్మలా సీతారామన్ అంచనా వేశారు. రైతుల ఆదాయం పెంచడానికి దృష్టిసారించారని తెలిసింది. పన్ను శ్లాబ్ రేట్లకు సంబంధించి మధ్య తరగతి వారికి ఊరట కలిగించేలా బడ్జెట్ ఉండనుంది. ఎన్నికల వేళ అన్ని వర్గాలను సమతుల్యం పాటిస్తూ నిర్మలా సీతారామన్ కేటాయింపులు చేశారని తెలుస్తోంది.
మరిన్ని బడ్జెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.