Share News

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు సమన్లు

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:25 PM

రాహుల్ గాంధీకి వరుసగా సమన్లు అందుతోన్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా బరేలి కోర్టు సైతం రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో వరుసగా ఆయన సమన్లు అందుకొంటున్నారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు సమన్లు
Rahul Gandhi

లక్నో, డిసెంబర్ 22: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌ కోర్టు ఆదివారం నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో యూపీలోని బరేలీ కోర్టులో పిటిషన్ దాఖలు అయింది. దాంతో 2025, జనవరి 07వ తేదీన కోర్టుకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ.. పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో సైతం రాహుల్ గాంధీ ఈ తరహా వ్యాఖ్యలను ప్రస్తావించారంటూ తన పిటిషన్‌లో పంకజ్ పాఠక్ స్పష్టం చేశారు.

Also Read: స్కూళ్లకు బాంబు బెదిరింపులు.. దొరికిపోయిన విద్యార్థులు

తాము అధికారంలోకి వస్తే.. దేశ సంపదను జనాభా ప్రాతిపదికన పంచుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అలాగే ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు సైతం జనాభా ప్రాతిపదికనే ఇస్తామన్నారు. అయితే రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో అతడి పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఆ క్రమంలో జనవరి 07వ తేదీన ఈ కేసు విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీని ఆదేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read: మహిళలకు గుడ్ న్యూస్.. మళ్లీ భారీగా తగ్గిన బంగారం ధరలు


మరోవైపు ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని స్థానిక కోర్టు ఇప్పటికే రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసిన విషయం విధితమే. భారత్ జోడో యాత్రలో భాగంగా 2022, నవంబర్‌ 17వ తేదీన మహారాష్ట్రలోని అకోలాలో రాహుల్ గాంధీ విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వీర సావర్కర్‌పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాహుల్ గాంధీ.. తన అనుచిత వ్యాఖ్యలతో సమాజంలో సామరస్యాన్ని దెబ్బ తీసేలా వ్యవహరించారంటూ.. న్యాయవాది నృపేంద్ర పాండే క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేశారు.

Also Read: జర్మనీలో దాడి.. పలువురి మృతి, ఏడుగురు భారతీయులకు గాయాలు


ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణలో భాగంగా న్యాయమూర్తి జస్టిస్ అలోక్ వర్మ.. రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేశారు. జనవరి 10వ తేదీన ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ రాహుల్‌కు కోర్టు సమన్లు జారీ చేసింది. జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ ఇంతకీ ఏమన్నారంటే.. వీర సావర్కర్‌ బ్రిటీషు వారికి సేవకుడిలా వ్యవహరించారన్నారు. అలాగే ఆయన పెన్షన్‌ సైతం తీసుకున్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు సైతం ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజుల వ్యవధిలోనే యూపీలోని రెండు కోర్టులకు రాహుల్ గాంధీ హాజరు కావాల్సి ఉంది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. 38 మంది మృతి

For National News And Telugu News

Updated Date - Dec 22 , 2024 | 01:37 PM