Share News

Uttar Pradesh: అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్.. నాలుగేళ్ల తర్వాత బయటపడ్డ ‘ఫేక్’ స్టోరీ

ABN , Publish Date - May 06 , 2024 | 06:21 PM

తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకొని కొందరు మహిళలకు అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయని అమాయకులపై లేనిపోని అభాండాలు మోపి, వారిని జైలుపాలు చేస్తున్నారు. కుటుంబ పరువు బజారుకీడ్చి...

Uttar Pradesh: అత్యాచారం కేసులో షాకింగ్ ట్విస్ట్.. నాలుగేళ్ల తర్వాత బయటపడ్డ ‘ఫేక్’ స్టోరీ

తమకు అనుకూలంగా ఉన్న చట్టాలను అడ్డం పెట్టుకొని కొందరు మహిళలకు అన్యాయాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయని అమాయకులపై లేనిపోని అభాండాలు మోపి, వారిని జైలుపాలు చేస్తున్నారు. కుటుంబ పరువు బజారుకీడ్చి, వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన ఓ మహిళ కూడా ఇదే పని చేసింది. తన కుమార్తెపై అత్యాచారం చేశాడంటూ ఓ వ్యక్తిపై తప్పుడు కేసు పెట్టింది. చివరికి నాలుగున్నరేళ్ల తర్వాత అసలు నిజం తేలడంతో.. కోర్టు ఆమెకు తగిన బుద్ధి చెప్పింది. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..


జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు

ఉత్తరప్రదేశ్‌లోకి బారాదరి ప్రాంతానికి చెందిన ఒక మహిళ.. 2019 డిసెంబర్ 2వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఓ ఫిర్యాదు చేసింది. అజయ్ అనే వ్యక్తి తన 15 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి, ఢిల్లీకి తీసుకెళ్లి, అక్కడ ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని ఆరోపించింది. తనపై అత్యాచారం జరిగిందని ఆమె కూతురు కూడా వాంగ్మూలం ఇవ్వడంతో.. పోలీసులు కేసు నమోదు చేసి అజయ్‌ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో అజయ్ నాలుగున్నరేళ్లు జైల్లోనే ఉన్నాడు. కట్ చేస్తే.. ఇన్నాళ్ల తర్వాత కోర్టు విచారణలో భాగంగా ఆ యువతి తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంది. అజయ్ తనపై అత్యాచారం చేయలేదని, తనని ఢిల్లీకి కూడా తీసుకెళ్లలేదని కుండబద్దలు కొట్టింది. దీంతో అదనపు సెషన్స్ కోర్టు (Additional Sessions Court) అజయ్‌ని నిర్దోషిగా విడుదల చేసింది.

పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

మరోవైపు.. అజయ్‌పై తప్పుడు కేసు పెట్టి, కోర్టును తప్పుదోవ పట్టించినందుకు గాను ఆ మహిళకు న్యాయస్థానం తగిన బుద్ధి చెప్పింది. ఎన్ని రోజులైతే అజయ్ (1653) జైల్లో గడిపాడో.. అన్ని రోజుల పాటు ఆమె జైల్లో గడపాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు.. ఆ మహిళకు రూ.5,88,822 జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించడంలో విఫలమైతే.. ఆరు నెలల అదనపు శిక్షను అనుభవించాల్సిన ఉంటుందని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి తీర్పును వెలువరించారు. చట్టాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతోనే.. సదరు మహిళకు శిక్ష విధించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - May 06 , 2024 | 06:21 PM