MS Dhoni: ‘జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు’
ABN , Publish Date - May 06 , 2024 | 03:56 PM
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో..
ఐపీఎల్-2024లో భాగంగా పంజాబ్ కింగ్స్‌పై (Punjab Kings) చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) నమోదు చేసిన విజయాన్ని పక్కనపెడితే.. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) చేసిన ప్రయోగంపై మాత్రం సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తొమ్మిదో స్థానంలో అతను బ్యాటింగ్‌కు దిగడాన్ని.. క్రికెట్ విశ్లేషకులు, మాజీలు తప్పు పడుతున్నారు. సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లను తన కంటే ముందుగా క్రీజులో పంపడానికి బదులు.. ధోనీ ఏడో స్థానంలో ఆడి ఉంటే బాగుండేదని చెప్తున్నారు.
తాజాగా హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని అనుకుంటే, అతను అసలు ఆడకూడదని మండిపడ్డాడు. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్‌ని జట్టులో తీసుకోవడం ఉత్తమమని పేర్కొన్నాడు. ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ మాట్లాడుతూ.. ‘‘తొమ్మిదో స్థానంలో ధోనీ బ్యాటింగ్ చేయాలని అనుకుంటే, అసలు అతను ఆడనేకూడదు. అలాంటప్పుడు ధోనీకి బదులు జట్టులోకి మరో ఫాస్ట్ బౌలర్‌ను చేర్చుకోవడం ఉత్తమం. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలనేది స్వతహాగా ధోనీ తీసుకున్న నిర్ణయమే. అయితే.. అతను ముందుగా బ్యాటింగ్‌కి రాకుండా తన జట్టుని పూర్తిగా నిరాశపరిచాడు’’ అని చెప్పాడు.
పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్
ధోనీ కంటే ముందు సాంట్నర్, శార్దూల్ ఠాకూర్ వచ్చారని.. అసలు ధోనీలాగా శార్దూల్ హిట్టింగ్ చేయగలడా? అని హర్భజన్ ప్రశ్నించాడు. ధోని అనుమతి లేకుండా జట్టులో ఏమీ జరగదని చెప్పిన హర్భజన్.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేయాలని ధోనీ తీసుకున్న నిర్ణయం మాత్రం తనకు నచ్చలేదని తేల్చి చెప్పాడు. అసలు ధోనీ ఎందుకు ఈ తప్పు చేశాడో అర్థం కావడం లేదన్నాడు. సీఎస్కేకి ఎక్కువ పరుగులున్న సమయంలో అతడు తొమ్మిదో స్థానంలో రావడం షాక్‌కి గురి చేసిందని తెలిపాడు. డెత్ ఓవర్లలో సీఎస్‌కే ఎక్కువ పరుగులు రాబట్టాలనుకుంటే.. ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తేనే బాగుంటుందని హర్భజన్ సింగ్ తన మనసులో మాట చెప్పుకొచ్చాడు.
నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు
కాగా.. సీఎస్కే ఐదు లేదా ఆరు వికెట్లు కోల్పోయినప్పుడు ధోనీ రంగంలోకి దిగుతుంటాడు. కానీ.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ధోనీ ఏకంగా 9వ స్థానంలో వచ్చాడు. తనకన్నా ముందు సాంట్నర్, శార్దూల్ ఠాకూర్‌లు వరుసగా ఏడు, ఎనిమిదో స్థానాల్లో దిగారు. వాళ్లిద్దరు ఔట్ అయ్యాక వచ్చిన ధోనీ.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తను 9వ స్థానంలో రావడమే ఫ్యాన్స్‌ని నిరాశపరిస్తే.. గోల్డెన్ డకౌట్ అవ్వడం మరింత డిజప్పాయింట్‌కి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే.. ధోనీ నిర్ణయంపై ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి.
Read Latest Sports News and Telugu News