Share News

AP Elections 2024: గుంటూరులో ఓట్ల కొనుగోళ్ల కలకలం.. ప్రత్యేక కూపన్లు ఇస్తున్న వైసీపీ

ABN , Publish Date - May 06 , 2024 | 05:21 PM

టీడీపీ కూటమి చేతిలో తన ఓటమి తథ్యమని భావిస్తున్న అధికార వైసీపీ.. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులను మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వారించినా.. ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని సూచించినా..

AP Elections 2024: గుంటూరులో ఓట్ల కొనుగోళ్ల కలకలం.. ప్రత్యేక కూపన్లు ఇస్తున్న వైసీపీ

టీడీపీ కూటమి (TDP Alliance) చేతిలో తన ఓటమి తథ్యమని భావిస్తున్న అధికార వైసీపీ (YSRCP).. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులను మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం (Election Commission) ఎన్నిసార్లు వారించినా.. ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని సూచించినా.. ఎన్నికల కోడ్ (Election Code) నిబంధనల్ని తుంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. అక్రమ మార్గంలో తిరిగి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న వైసీపీ.. ఓట్ల కొనుగోళ్లను ప్రారంభించింది. తమ పార్టీకి ఓటు వేసిన వారికి డబ్బులిస్తామంటూ బహిరంగ ప్రచారానికే దిగింది. ఇందుకోసం ప్రత్యేక కూపన్‌లను పంపిణీ చేస్తోంది.


పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

ఆల్రెడీ గుంటూరు (Guntur) తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఈ కూపన్‌లను ఓటర్లకు ఇస్తున్నట్టు తెలిసింది. తమ పార్టీకి ఓటు వేసిన తర్వాత ఈ కూపన్ ఇస్తే, డబ్బులు ఇస్తామని ప్రలోభాలు పెడుతోంది. బహిరంగంగానే ఈ కూపన్‌లను వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అటు.. స్థానిక నేతలు దీనిపై గగ్గోలు పెడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి మస్తాన్ వలి (Congress Candidate Mastan Vali) ఈ అంశాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక కూపన్లతో ఓట్ల కొనుగోళ్లకు వైసీపీ పాల్పడుతోందని ఆయన ఫిర్యాదు చేశారు.

‘జట్టులో ధోనీ అవసరమా.. అతను చేసింది పెద్ద తప్పు’

అటు.. ఎమ్మెల్యే పేర్ని నాని సైతం తన కుమారుడ్ని అడ్డదారుల్లో అందలమెక్కించేందుకు అనేక ప్రలోభాలకు గురి చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ ముందు, ఆ తర్వాత పెద్దఎత్తున ‘ఫేక్ నివేశన స్థలాల’ను పంపిణీ చేశారు. ఈ విషయంలో ఓ వీఆర్ఓపై వేటు పడింది. అలాగే.. నోట్లతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. పేర్ని నాని పంపిన నోట్లతో వైసీపీ కార్పొరేటర్ తిరుమలశెట్టి వరప్రసాద్ కెమెరాకు చిక్కారు. ఎన్నికల సంఘం వార్నింగ్ ఇచ్చినా వైసీపీ ఇలాంటి అక్రమ పనులకు తెగబడుతోందని.. ఆ పార్టీని ఓటమి భయం ఎంతలా వెంటాడుతోందో అర్థం చేసుకోవచ్చు.

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 06 , 2024 | 05:21 PM