AAP: కేజ్రీవాల్‌ను ఈడీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే..?
ABN , Publish Date - Mar 21 , 2024 | 10:05 PM
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ ముఖ్య కుట్రదారు అని మీడియాకు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించారు. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకు భారీగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అందుకు ప్రతీగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించారు.
ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో న్యూ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో కేజ్రీవాల్ (Arvind Kejriwal) ముఖ్య కుట్రదారు అని మీడియాకు విడుదల చేసిన నోట్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత, ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లతో కలిసి కుట్రకు తెరతీశారని వివరించారు. న్యూ ఎక్సైజ్ పాలసీతో సౌత్ లాబీకు భారీగా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. అందుకు ప్రతీగా సౌత్ లాబీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల నగదు ఇచ్చిందని వెల్లడించారు. లిక్కర్ పాలసీ కేసు విచారణ క్రమంలో కొందరు నిందితులు, సాక్షులు తమ వాంగ్మూలంలో అరవింద్ కేజ్రీవాల్ పేరును చెప్పారని అధికారులు రిమాండ్, చార్జిషీట్లలో రాశారు.
లిక్కర్ పాలసీ కేసులో నిందితుడు అయిన విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయానికి తరచు వెళ్లేవారని అధికారులు తెలిపారు. ఎక్కువ సమయం అక్కడే గడిపేవారని వివరించారు. అలాగే లిక్కర్ పాలసీ గురించి కేజ్రీవాల్‌తో చర్చించామని మద్యం వ్యాపారులకు విజయ్ నాయర్ చెప్పారని అధికారులు పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ను కలువడానికి ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రను విజయ్ నాయర్ పంపారని తెలిపారు. తర్వాత మరోసారి ముగ్గురు కలిసి వీడియో కాల్ మాట్లాడారని వివరించారు. తను విశ్వసించే వారిలో నాయర్ ఒకరని మహేంద్రతో అరవింద్ కేజ్రీవాల్ అన్నారని ఈడీ అధికారులు చెబుతున్నారు. సౌత్ లాబీలో తొలి నిందితుడు రాఘవ్ మాగుంట సాక్షిగా మారిన సంగతి తెలిసిందే. రాఘవ్ తండ్రి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరవింద్ కేజ్రీవాల్‌ను కలిశారని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.