Share News

Food Fact : లిచీల్లో ఏముంది?

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:02 AM

వర్షాకాలంలో మార్కెట్లను ముంచెత్తే లిచి పండ్ల మూలాలు చైనాలో ఉన్నాయి. ఈ తీయని పండులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.

Food Fact : లిచీల్లో ఏముంది?

ఫుడ్‌ ఫ్యాక్ట్‌

ర్షాకాలంలో మార్కెట్లను ముంచెత్తే లిచి పండ్ల మూలాలు చైనాలో ఉన్నాయి. ఈ తీయని పండులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, మినరల్స్‌ను కలిగి ఉండే లిచి పండ్లు జీవక్రియలన్నిటికీ తోడ్పడతాయి. వీటిలోని విటమిన్‌ సి, చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తికి దోహదపడుతుంది.

చర్మపు బిగుతు పెరిగి, యవ్వనాన్ని సంతరించుకుంటుంది. లిచిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి డీహైడ్రేషన్‌ ముప్పు తగ్గుతుంది. లిచిలోని పొటాషియం, మెగ్నీషియం, కాపర్‌, ఫోలేట్‌లు, గుండె ఆరోగ్యానికీ, నాడుల పనితీరుకూ, ఎర్ర రక్త కణాల తయారీకీ తోడ్పడతాయి. ఈ పండ్లలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల వల్ల శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. ఈ పండ్లలోని పీచు వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం పెరగడంతో పోషక శోషణ పెరిగి పరిపూర్ణ ఆరోగ్యం సమకూరుతుంది.

Updated Date - Jun 11 , 2024 | 12:03 AM