CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల..

ABN, Publish Date - Jul 31 , 2024 | 01:40 PM

హైదరాబాద్: ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ రెండో విడత నిధులు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం.. రూ. 6,191 కోట్ల నిధులు విడుదల చేశారు. రెండో విడతలో భాగంగా అసెంబ్లీలో సీఎం ప్రారంభించారు. వేదికపై 17 మంది రైతులకు సీఎం చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. రైతు రుణమాఫీ చేయడంతో తమ జన్మ ధన్యమైందని అన్నారాయన.

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 1/6

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీలో రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేసి.. ప్రసంగిస్తున్న దృశ్యం..

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 2/6

రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్న రైతు సంఘాల నేతలు..

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 3/6

ఇచ్చిన మాట ప్రకారం రెండో విడత రైతు రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నమస్కరిస్తున్న వృద్ధ మహిళా రైతు..

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 4/6

రెండో విడత రైతు రుణ మాఫీ చేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియా ప్రసంగాన్ని స్క్రీన్‌పై తిలకిస్తున్న ప్రభుత్వ అధికారులు..

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 5/6

నల్గొండలో రెండో విడత రైతు రుణ మాఫీ ఖాతా బుక్‌లో బ్యాంక్ వద్ద వివరాలు అడిగి తెలుసుకుంటున్న రైతులు..

CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల.. 6/6

నల్గొండ పట్టణంలో యూనియన్ బ్యాంక్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి రైతులకు రుణ మాఫీ వివరాలు తెలియజేస్తున్న బ్యాంక్ ఉద్యోగి.

Updated at - Jul 31 , 2024 | 01:40 PM