Home » Byreddy Shabari
నంద్యాల జిల్లా రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు జిల్లాలో వైసీపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీ స్థానిక సంస్థల ప్రతినిధులు, మున్సిపల్ కౌన్సిలర్లు టీడీపీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. నేతల చేరికలతో టీడీపీ బలపడుతున్నా.. గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి.
నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంపీ తండ్రినని పెత్తనం చెలాయిస్తే కుదరదని, వైసీపీ నాయకులను టీడీపీలోకి తెస్తానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కలలో కూడా ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఆఖరికి ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయి క్రికెట్ టీమ్‌లాగా 11 కే పరిమితం అయిన పరిస్థితి. దీంతో ఫలితాల మరుసటి రోజే రాజీనామాలు మొదలై.. నేటికి కొనసాగుతూనే ఉన్నాయి...
ప్రజల ఆశీస్సులతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏపీలో ఘన విజయం సాధించిందని నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(MP Byreddy Shabari) పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఆమె లోక్‌సభ (Loksabha)లో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu)ను ఉద్దేశించి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ(TMC MP Kalyan Banerjee) ఉదయం సభలో చేసిన వ్యాఖ్యలను తొలుత ఆమె తీవ్రంగా ఖండించారు.
ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లోకి సీఎం నారా చంద్రబాబు నాయుడు యంగ్ ఎమ్మెల్యేలను తీసుకున్న సంగతి తెలిసిందే. యువతకు టికెట్లు ఇవ్వడమే కాదు.. వారిని గెలిపించుకుని అసెంబ్లీకి తీసుకురావడం.. మంత్రులుగా తీసుకోవడం.. ఇలా ఎక్కడ చూసినా యంగర్స్‌కు బాబు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు...