Viral Video: ఇంటి సీలింగ్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. బద్దలు కొట్టి చూడగా చివరకు..
ABN , Publish Date - Dec 07 , 2024 | 05:04 PM
ఊహించని ప్రదేశాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. నీళ్ల కోసం ఫ్రిడ్జ్ డోరు తీస్తే పాములు బయటికి రావడం, పడుకుందామని మంచం వద్దకు వెళ్తే పరుపు కింద గుట్టలుగా నల్లులు బయటపడడం వంటి ఘటనలు తర చూస్తుంటాం. వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు ..
ఊహించని ప్రదేశాల్లో కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. నీళ్ల కోసం ఫ్రిడ్జ్ డోరు తీస్తే పాములు బయటికి రావడం, పడుకుందామని మంచం వద్దకు వెళ్తే పరుపు కింద గుట్టలుగా నల్లులు బయటపడడం వంటి ఘటనలు తర చూస్తుంటాం. వింత వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంటి సీలింగ్‌లో వింత శబ్ధాలు వస్తుడడంతో పగులగొట్టారు. చివరకు సీలింగ్ లోపల చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన మలేషియాలో చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటి సీలింగ్ నుంచి వింత శబ్ధాలు రావడం మొదలెట్టాయి. దీంతో ఇంట్లోని వారికి అనుమానం కలిగింది. చివరకు రెస్క్యూ టీంకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వారు.. ఇంటి సీలింగ్‌ను పరిశీలించారు.
చివరకు సీలింగ్‌ను పగులగొట్టారు. తీరా సీలింగ్‌లో పరిశీలించగా.. సుమారు 20 అడుగుల పొడవున్న (python in the house ceiling) ఓ పెద్ద కొండచిలువ కనిపించింది. దాన్ని చూడగానే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా సేపు శ్రమించి అతి కష్టం మీద ఆ కొండచిలువను బయటికి తీశారు. ఆ కొండచిలువ సుమారు 80 కిలోల బరువు ఉందని రెస్క్యూ టీం తెలిపింది. అనంతరం దాన్ని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.
Viral Video: కోబ్రా కాటేస్తున్నా పట్టించుకోని కోతి.. చివరకు ఏం చేసిందో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..
ఈ కొండచిలువను సుమారు 200 కిలోల బరువు వరకు ఉండడంతో పాటూ 30 ఏళ్లు జీవిస్తాయని తెలిసింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇంటి సీలింగ్‌లో ఇంత పెద్ద కొండచిలువను ఇప్పుడే చూస్తున్నాం’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటేనే భయంగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Viral: ఛీ.. ఇలాకూడా స్నానం చేస్తారా.. ఈ బాత్రూం కట్టినోడు కనపడితే వెంటపడి కొడతారు..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..