Viral Video: ఉంగరం కోసం వధూవరుల మధ్య పోటాపోటీ.. చివరకు వరుడికి ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే..
ABN , Publish Date - Dec 06 , 2024 | 09:55 PM
ప్రస్తుతం ఎక్కడ ఎవరి వివాహం జరిగినా అందుకు సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవడం సర్వసాధారణమైపోయింది. వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వీడ్కోలు కార్యక్రమం వరకూ ఏదో ఒక సంఘటన వీడియో రూపంలో నెట్టింట వైరల్ అవుతోంది. వీటిలో..
ప్రస్తుతం ఎక్కడ ఎవరి వివాహం జరిగినా అందుకు సంబంధించిన ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైలర్ అవడం సర్వసాధారణమైపోయింది. వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి వీడ్కోలు కార్యక్రమం వరకూ ఏదో ఒక సంఘటన వీడియో రూపంలో నెట్టింట వైరల్ అవుతోంది. వీటిలో వధూవరుల మధ్య చోటు చేసుకునే సరదా సంఘటనలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో ఉంగరం కోసం వధూవరుల మధ్య పోటాపోటీ నెలకొంది. చివరకు వరుడికి వధువు ఎలా షాక్ ఇచ్చిందో చూస్తే అంతా అవాక్కవుతారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) కార్యక్రమంలో వేదికపై వధూవరులకు (bride and groom) పాలలో ఉంగరం (ring) తీసే పోటీ నిర్వహించారు. ఓ పెద్ద పాత్రలో పాలు పోసి అందులో ఓ ఉంగరాన్ని పడేశారు. దాన్ని ఎవరు తీస్తే వారే విజేత అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఉంగరం కోసం వధూవరుల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఇద్దరూ పాలలో చేతులు పెట్టి, ఉంగరాన్ని తీసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వరుడు దాదాపు ఉంగరాన్ని చేతిలోకి తీసేసుకుంటాడు. అయితే ఓటమిని అంగీకరించని వధువు.. వరుడి చేతిలోని ఉంగరాన్ని లాక్కుని మళ్లీ పాలలో పడేస్తుంది. ఆ తర్వాత అతడి కంటే ముందే అందులో చేయి పెట్టి ఉంగరాన్ని చేతిలోకి తీసేసుకుంటుంది. ఇలా తన తెలివితో ఉంగరాన్ని చేజిక్కించుకుని అంతా అవాక్కయ్యేలా చేసింది.
Viral Video: వామ్మో.. ఇదేంట్రా బాబోయ్.. నడి రోడ్డుపై కింగ్ కోబ్రాతో ఫన్నీ గేమ్స్..
కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువు టాలెంట్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘వరుడికి షాక్ ఇచ్చిన వధువు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 640కి పైగా లైక్‌లు, 52 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: మీ తెలివి సల్లగుండ.. కష్టపడుతున్నారనుకుంటే.. ఇదా మీరు చేసేది..
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..