Share News

Viral Video: అవి కారు లైట్లా లేక క్యారీ బ్యాగులా.. అనుమానం వచ్చి తొలగించగా..

ABN , Publish Date - Aug 16 , 2024 | 06:17 PM

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలిగించేలా ఉంటే.. మరికొందరు తెలివితేటలు అనితర సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇలాంటి వారికి ప్రస్తుత టెక్నాలజీ మరింత తోడవుతోంది. ఈ క్రమంలో కొందరు తెలివితేటలను మంచి కోసం ప్రయోగిస్తుంటే.. మరికొందరు ..

Viral Video: అవి కారు లైట్లా లేక క్యారీ బ్యాగులా.. అనుమానం వచ్చి తొలగించగా..

కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలిగించేలా ఉంటే.. మరికొందరు తెలివితేటలు అనితర సాధ్యం అనిపించేలా ఉంటాయి. ఇలాంటి వారికి ప్రస్తుత టెక్నాలజీ మరింత తోడవుతోంది. ఈ క్రమంలో కొందరు తెలివితేటలను మంచి కోసం ప్రయోగిస్తుంటే.. మరికొందరు వివిధ రకాల నేరాలు చేసేందుకు వాడుతున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కారు లైట్లపై అనుమానం వచ్చి తొలగించి చూడగా... లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వాహనాల్లో వివిధ రకాల వస్తువులను అక్రమంగా తరలించే క్రమంలో నేరస్థులు చాలా తెలివిగా ఆలోచిస్తుంటారు. కొన్నిసార్లు కొందరు పోలీసులకు దొరక్కుండా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. కూరగాయల్లో గంజాయి, వరిపొట్టు మాటున ఇసుక, ఇసుకలో ఎర్రచందనం.. ఇలా అతి తెలివిగా తరలిస్తూ పోలీసులకు దొరికిపోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి విచిత్ర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

Viral Video: బెత్తంతో బాదుతున్న ప్రిన్సిపాల్.. వీడియో చూస్తే ఫ్లాష్‌బ్యాక్ కనిపించడం ఖాయం..


వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు ఓ కారు లైట్లను చూడగానే అనుమానం కలిగింది. దీంతో ఆ కారును ఆపి లైట్ల సమీపానికి వెళ్లారు. వారి అనుమానం మరింత బలపడడంతో చివరకు లైట్ల అద్దాలను (car lights) తొలగింపజేశారు. అద్దాలు తీసి చూడగా లోపల షాకింగ్ దృశ్యం కనిపించింది. పదుల సంఖ్యలో మద్యం టెట్రా ప్యాకెట్లు (Alcohol Tetra packets) కనిపించాయి. ఇలా కారులోని అన్ని లైట్ల అద్దాల వెనుక గుట్టలు గుట్టలు మద్యం ప్యాకెట్లు బయటపడ్డాయి. మొత్తం 303 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి తెలివితేటలు చూసి పోలీసులే ఖంగుతినాల్సి వచ్చింది.

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..


విచారణలో ఈ మద్యం ప్యాకెట్లను యూపీలోని (UP) బల్లియా నుంచి బీహార్‌లోని (Bihar) ఛప్రా ప్రాంతానికి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. గతంలో ఓ వ్యక్తి పుస్తకాల మధ్యలో మద్యం ప్యాకెట్లను తరలించిన వీడియో కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘తెలిసిన వారే పోలీసులు చెప్పి ఉంటారు’’.. అంటూ కొందరు, ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగిచూడగా దిమ్మతిరిగే సీన్..

Updated Date - Aug 16 , 2024 | 06:17 PM