Share News

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..

ABN , Publish Date - Aug 16 , 2024 | 03:46 PM

అడవిలో జంతువుల మధ్య నిత్యం చావుబతుకుల పోరాటం నడుస్తుంటుంది. ఆకలి తీర్చుకోవడానికి కొన్ని జంతువులు, ప్రాణాలు కాపాడుకోవడానికి మరికొన్ని జంతువులు రకరకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. పులులు, సింహాలు, హైనాల దాడి సమయంలో...

Viral Video: దాడి నుంచి తప్పించుకోవాడానికి అడవిదున్న మాస్టర్ ప్లాన్.. దాని స్కెచ్ చూసి ఖంగుతిన్న హైనా.. చివరకు..

అడవిలో జంతువుల మధ్య నిత్యం చావుబతుకుల పోరాటం నడుస్తుంటుంది. ఆకలి తీర్చుకోవడానికి కొన్ని జంతువులు, ప్రాణాలు కాపాడుకోవడానికి మరికొన్ని జంతువులు రకరకాల ప్రయత్నాలు చేయడం చూస్తుంటాం. పులులు, సింహాలు, హైనాల దాడి సమయంలో అప్పుడప్పుడూ షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కొన్న ఓ హైనా దున్నపోతును వేటాడేందుకు ప్రయత్నిస్తుంది. దాన్నుంచి తప్పించుకోవడానికి అడవిదున్న చివరకు మాస్టర్ ప్లాన్ వేస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కెన్యాలోని (Kenya) మాసాయి మారా నేషనల్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మారా నడి ఒడ్డున అడవి దున్నలు మేత మేస్తుంటాయి. వాటిని గమనించిన హైనా వాటిపైకి దాడి దిగుతుంది. హైనాను చూగానే దున్నపోతులన్నీ అక్కడి నుంచి పారిపోతాయి. అయితే వాటిలో ఓ దున్న మాత్రం మందకు దూరంగా వస్తుంది. దీంతో చివరకు హైనా (hyena chasing wildebeest) ఆ దున్నపోతును టార్టెట్ చేసి వెంటపడుతుంది.

Viral Video: కుక్కను నీటిలోకి విసరబోయిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..


హైనా రావడం చూసి దానికి దొరక్కుండా దున్న అత్యంత వేగంతా పరుగెడుతుంది. చివరకు దాన్ని దారి తప్పించేందుకు పైనుంచి (wildebeest jumping into river ) అక్కడే ఉన్న నదిలోకి పైనుంచి దూకేస్తుంది. ఈ క్రమంలో మట్టిగడ్డలు తగులుకొంటూ కిందపడిపోతుంది. వెనుకే వచ్చిన హైనా కూడా కిందకు దూకి అడవి దున్నను పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అయితే చూస్తుండగానే దున్నపోతు కిందకు పరుగెత్తుకుంటూ వెళ్లి చివరకు నీటిలోకి దూకుతుంది. చూస్తుండగానే నీటి మధ్యలోకి వెళ్లపోతుంది. మరోవైపు హైనా మాత్రం దున్నపోతును వెంబడించలేక.. నిలబడి అలాగే చూస్తుండిపోతుంది.

Viral Video: ఆవేశంగా వచ్చిన ఎలిగేటర్.. ఉన్నట్టుండి తలపై చేయి పెట్టిన యువతి.. చివరకు..


ఇలా చివరకు ఈ అడవిదున్న ఎంతో తెలివితో హైనా దాడి నుంచి తప్పించుకుంటుంది. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న పర్యాటకులు తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తు్న్నారు. ‘‘ఈ అడవిదున్న ప్లాన్ మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘హైనాకు చుక్కలు చూపించిన దున్న’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 71 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పాత్రలు కడుగుతున్న మహిళపై అనుమానం.. తీరా దగ్గరికి వెళ్లి చూడగా.. షాకింగ్ సీన్..

Updated Date - Aug 16 , 2024 | 03:46 PM