Share News

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

ABN , Publish Date - Aug 14 , 2024 | 09:40 PM

గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం నేరమని తెలిసినా చాలా మంది దొంగచాటుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా వరకూ ఇలాంటి సందర్భాల్లో పురాతన కట్టడాలు ధ్వంసమవడం తప్ప వారికి ఎలాంటి బంగారు వస్తువులు దొరికిన దాఖలాలు ఉండవు. అయితే...

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం నేరమని తెలిసినా చాలా మంది దొంగచాటుగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చాలా వరకూ ఇలాంటి సందర్భాల్లో పురాతన కట్టడాలు ధ్వంసమవడం తప్ప వారికి ఎలాంటి బంగారు వస్తువులు దొరికిన దాఖలాలు ఉండవు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వ్యూ్స్, లైకుల కోసం ఇలాంటి తవ్వకాలను కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలీదు గానీ... ఇలాంటి వీడియోలు మాత్రం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది. ఓ వ్యక్తి నేలపై తవ్వుతుండగా మధ్యలో అతడికి ఓ మట్టికుండ కనిపిస్తుంది. అందులో ఏముందా అని చూడగానే చివరకు షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఇటీవల తవ్వకాలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. మెటల్ డిటెక్టర్‌తో (Metal detector) పరిశీలిస్తుండగా.. ఉన్నట్టుండి శబ్ధం వస్తుంది. దాని ఆధారంగా మట్టిలో తవ్వి చూడగా (Gold objects found in soil) చివరకు పురాతన వస్తువులు, బంగారు నాణేలు బయటపడతాయి.

Viral Video: కోతి ముందు పిల్ల చేష్టలు చేస్తే.. ఇలాగే ఉంటుంది మరి.. ఈ బాలిక పరిస్థితి చూస్తే..


ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ ఘటనలను పరిశీలిస్తే నిజం కానట్లు అనిపిస్తున్నా.. ఇలాంటి వీడియోలకు వ్యూస్, లైక్‌లు మాత్రం భారీగానే వస్తుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలోనూ ఓ వ్యక్తి నేలపై తవ్వకాలు చేపడతాడు. అయితే మట్టిలో కొంత వరకూ తవ్వగానే అతడికి ఓ మట్టి కుండ కనిపిస్తుంది. దాన్ని బయటికి తీసిన ఆ వ్యక్తి.. అందులో ఏముందో తెలుసుకునేందుకు దాన్ని సుత్తితో పగులకొడతాడు. చివరగా అందులో (Gold coins in clay pot) చూడగా షాకింగ్ సీన్ కనిపించింది. బంగారు నాణేలు మెరుస్తూ కనిపిస్తాయి.

Viral Video: బైకుపై వెళ్తూ వినూత్నంగా రీల్ చేయాలనుకున్నారు.. వేగంగా వెళ్తూ మధ్యలో వెనుక్కు తిరిగి చూడగా..


అయితే ఈ ఘటనను బాగా పరిశీలించినా కూడా ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేసినట్లుగా అనిపిస్తుంది. కాగా, ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా వ్యూస్ కోసం కావాలని చేశారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి నిజం కాదు.. ఎవరూ నమ్మకండి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 8వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: వీరి తెలివి తెల్లారిపోనూ.. సబ్బు చోరీ కాకుండా వీళ్లు చేసిన నిర్వాకం చూస్తే..

Updated Date - Aug 14 , 2024 | 09:40 PM