Wedding Card : నెట్టింట వైరల్ అవుతున్న డాక్టర్, సోల్జర్.. పెళ్లిలోనూ వీళ్ల మార్క్ మిస్ అవ్వలేదుగా ...
ABN , Publish Date - Jan 25 , 2024 | 07:02 PM
వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం జరిగే వివాహాల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటోంది. కార్యక్రమం ఆద్యంతం ప్రతి ఘట్టాన్నీ వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. దీంతో...
వివాహాల నిర్వహణలో ఒకప్పటికి, ఇప్పటికి ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం జరిగే వివాహాల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉంటోంది. కార్యక్రమం ఆద్యంతం ప్రతి ఘట్టాన్నీ వినూత్నంగా రూపొందించుకుంటున్నారు. దీంతో ఇలాంటి వివాహాలకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, డాక్టర్, సోల్జర్ వివాహానికి సంబంధించిన పెళ్లి కార్డు ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. ‘‘పెళ్లిలోనూ వీళ్ల మార్క్ మిస్ అవ్వలేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వెడ్డింగ్ ఫొటో తెగ చక్కర్లు (Viral wedding photo) కొడుతోంది. ఆర్మీలో పని చేసే అద్నాన్ అనే వ్యక్తికి, డాక్టర్‌గా పని చేసే రామ్షా అనే యువతికి వివాహం నిశ్చయమైంది. అయితే తమ వివాహ వెడ్డింగ్ కార్డు (Soldier and Doctor Wedding Card) అందరిలా కాకుండా వినూత్నంగా ఉండాలని అనుకున్నారు. ఇందుకోసం చివరకు వారి వృత్తి ప్రతిభింభించేలా కార్డును డిజైన్ చేశారు. కార్డు కవర్‌ను కోటు లాగా డిజైన్ చేయించారు.
ఆ కోటులో సగం సోల్జర్ లాగా.. ఇంకో సగం డాక్టర్‌లాగా ఉంది. డాక్టర్ కోటుపై ‘డాక్టర్ రామ్షా’, ఆర్మీ కోటుపై ‘కెప్లెన్ అద్నాన్’.. అని రాసి ఉంది. ఈ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కార్డు చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వృత్తి పట్ల అంకితభావం అంటే ఇదే’’.., ‘‘ఇలాంటి వెడ్డింగ్ కార్డు ఎప్పుడూ చూడలేదు’’.., ‘‘ఇది ఇద్దరు వ్యక్తుల వివాహమా.. లేక ఇద్దరు నిపుణుల వివాహమా’’.., ‘‘డిజైనింగ్ చాలా బాగుంది’’.., ‘‘ఈ కార్డు.. ఎవరో కావాలనే ఇలా చేశారు’’.., ‘‘పెళ్లి తేదీ లేదు ఏమీ లేదు.. ఇది ఫేక్’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.