Viral Video: ఆత్మహత్య చేసుకునేందుకు వంతెన ఎక్కిన వ్యక్తి.. పోలీసుల బంపర్ ఆఫర్ విని ఏం చేశాడంటే..
ABN , Publish Date - Jan 24 , 2024 | 09:09 PM
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు, అందరినీ బెదిరించి.. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు బిల్డింగులు, సెల్ టవర్లు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో ...
ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు, అందరినీ బెదిరించి.. తమ డిమాండ్లు నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మరికొందరు బిల్డింగులు, సెల్ టవర్లు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేయడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు దురదృష్టవశాత్తు కొందరు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సందర్భాలను కూడా చూశాం. అయితే ఇలాంటి సందర్భంలో అప్పుడప్పుడూ తమాషా సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు భారీ వంతెనను ఎక్కేశాడు. అయితే చివరకు పోలీసులు ఇచ్చిన బంపర్ ఆఫర్ కాదనలేక.. కిందకు దిగేశాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. కోల్కతాలో (Kolkata) సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పార్క్ సర్కస్ ప్రాంతంలోని భారీ ఇనుప వంతెన (iron bridge) వద్ద ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెతో కలిసి బైకుపై బ్రిడ్జి వద్దకు వచ్చాడు. అక్కడ బైకు ఆపి ఫోన్ పడిపోయిందని, చూడమంటూ కూతురుకు చెప్పారు. ఆమె ఫోన్ కోసం వెతుకుతుండగా.. అతను ఒక్కసారిగా వంతెన పైకి ఎక్కేశాడు. పైనుంచి దూకేస్తా అంటూ (suicide attempt) అరుపులు మొదలెట్టాడు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారంతా అక్కడ గుమికూడారు. ఎవరు ఎంత చెప్పినా అతను వినలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, అతడికి నచ్చజెప్పాలని చూశారు. అయినా అతను వినిపించుకోలేదు. చివరకు వారికి ఓ ఐడియా వచ్చింది. ‘‘నీకు ప్రముఖ హోటల్ నుంచి మంచి బిర్యాని తెప్పిస్తాం.. ఆత్మహత్య ఆలోచన విరమించుకుని కిందకు దిగేయ్’’.. అంటూ వినయంగా చెప్పారు.
పోలీసులు బిర్యానీ ఆఫర్ ఇవ్వడంతో ఎట్టకేలకు అతను తన మనసు మార్చుకుని కిందకు దిగేశాడు. చాలా సేపు ఈ డ్రామా నడవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. టైల్స్ వ్యాపారంలో తీవ్రంగా నష్టాలు రావడంతో అతను ఆర్థికంగా నష్టపోయినట్లు తెలిసింది. అలాగే భార్య కూడా విడాకులు ఇవ్వడం, తన చిన్న కుమార్తె కూడా దూరంగా వెళ్లిపోవడంతో మానసికంగా మరింత కుండిపోయాడు. ఇటీవల అతడి పెద్ద కుమార్తె కూడా సరిగా పట్టించుకోవడం లేదని అతను తెలిపాడు. దీంతో చివరకు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. మొత్తానికి అతను క్షేమంగా కిందకు దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: రైల్వే ప్లాట్ఫామ్ పైనే ప్రేమాయణం.. జంట వికృత చేష్టలకు అవాక్కయిన ప్రయాణికులు..