Share News

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..

ABN , Publish Date - Jan 24 , 2024 | 05:40 PM

ప్రేమికుల మధ్య వివిధ రకాల సమస్యలు తలెత్తడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రేయసిని ప్రియుడు మోసం చేస్తే.. మరికొన్నిసార్లు ప్రియుడికి ప్రేయసి జలక్ ఇస్తుంటుంది. ఇంకొన్నిసార్లు..

Viral: రాత్రి వేళ మాజీ ప్రియుడి ఇంటి వద్ద బాంబు పెట్టిన యువతి.. గోడపై ఆమె రాసిన సందేశం చూసి అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికుల మధ్య వివిధ రకాల సమస్యలు తలెత్తడం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ప్రేయసిని ప్రియుడు మోసం చేస్తే.. మరికొన్నిసార్లు ప్రియుడికి ప్రేయసి జలక్ ఇస్తుంటుంది. ఇంకొన్నిసార్లు ఇద్దరూ కలిసి తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకొనే పరిస్థితి కూడా వస్తుంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇంగ్లండ్‌లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న యువతి.. ఓ రోజు రాత్రి వేళ్ల అతడి ఇంటి బయట బాంబు పెట్టింది. వెళ్తూ వెళ్తూ గోడపై ఆమె రాసింది చూసి స్థానికులతో పాటూ పోలీసులూ షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఇంగ్లండ్‌లోని (England) నార్తాంప్టన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన లారెన్ మేరీ టాల్బోట్ అనే యువతికి, ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది క్రమంగా ప్రేమకు దారి తీసింది. కొన్నేళ్ల పాటు సాగిన వీరి ప్రేమాయనానికి ఇటీవల ఉన్నట్టుండి బ్రేక్ పడింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇద్దరి మధ్య దూరం పెరిగింది. దీంతో కొన్ని నెలలుగా వారిద్దరి మధ్య ఎలాంటి మాటలూ లేవు. అతడితో కలవాలని మేరీ ఎంత ప్రయత్నించినా.. ప్రియుడు మాత్రం అంగీకరించలేదు. దీంతో మేరీ తన ప్రియుడిపై (woman angry with her boyfriend) కోపం పెంచుకుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఇందుకోసం ఎన్నో రకాల ప్లాన్లు వేసింది.

Viral Video: పగిలిపోయిన లారీ లైటుకు అదిరిపోయే రీప్లేస్‌మెంట్.. ఎలా వస్తాయయ్యా! ఇలాంటి ఐడియాలు..

lovers-viral-news.jpg

చివరకు ఓ నిర్ణయానికి వచ్చిన ఆమె.. ఇటీవల ఓ రోజు ప్రియుడి ఇంటి వద్దకు వెళ్లింది. చుట్ట పక్కల ఎవరూ లేని సమయం చూసి అతడి ఇంటి తలుపు వద్ద బాంబు (bomb attack) పెట్టి వచ్చింది. వస్తూ వస్తూ ఆ ఇంటి గోడపై.. ‘‘ఈ ఫ్లాట్ నరకంలో కాలిపోతుంది’’.. అని రాసి వచ్చింది. కాసేపటికి అది పెద్ద శబ్ధంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ ఇంటి తలుపులతో పాటూ గోడలు కూడా దెబ్బతిన్నాయి. పేలుడు దాటికి చుట్టు పక్కల వారు భయంతో పరుగులు తీశారు. అయితే ఆ సమయంలో మేరీ ప్రియుడు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. చివరకు సీసీ ఫుటేజీ ఆధారంగా మేరీని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం మేరీని దోషిగా తేలుస్తూ.. ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ ప్రేమికుల మధ్య గొడవకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: చూసేందుకు పాడుబడిన మరుగుదొడ్లే.. కానీ వాటి వెనుకకు వెళ్లి చూడగా.. దిమ్మతిరిగే దృశ్యం..

Updated Date - Jan 24 , 2024 | 05:42 PM