Kitchenhacks: దువ్వెన వాడే ముందు ఇలా చేశారంటే.. ఏం జరుగుతుందో తెలుసా..
ABN , Publish Date - Jan 25 , 2024 | 03:10 PM
ప్రస్తుత యువత పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు తరచూ జేబులో నుంచి దువ్వెన తీసి, పదే పదే దువ్వుకోవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే..
ప్రస్తుత యువత పది మందిలో ప్రత్యేకంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కొందరు తరచూ జేబులో నుంచి దువ్వెన తీసి, పదే పదే దువ్వుకోవడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందటే.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దువ్వెన వాడే ముందు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో ఓ మహిళ వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వెరీ గుడ్ ఐడియా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. కొందరికి జేబులో పర్సు ఎలాగో.. ఇంకో జేబులో దువ్వెన అలాగన్నమాట. చీటికీ మాటికీ దువ్వెన బయటికి తీసి, దువ్వుకోవడం చూస్తూ ఉంటాం. ఇంతవరకూ బాగానే ఉన్నా.. దువ్వెనతో (comb) పదే పదే దువ్వుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రధానంగా దువ్వెన యొక్క పదునైన దంతాల కారణంగా చర్మం దెబ్బతినడంతో పాటూ వెంట్రుకలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనే విషయంపై ఓ మహిళ (woman) వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Viral Video: ఆత్మహత్య చేసుకునేందుకు వంతెన ఎక్కిన వ్యక్తి.. పోలీసుల బంపర్ ఆఫర్ విని ఏం చేశాడంటే..
దువ్వెన కొనగానే ముందుగా వాటి దంతాలను వేడి చేసిన పెనంపై అటూ ఇటూ తిప్పుతూ మృదువుగా అయ్యేలా చేయాలి. దంతాల చివర్లలో పాటూ ఇరువైపులా మృదువుగా చేసి, తర్వాత వాడితే సమస్య ఉండదని వివరించింది. ఈ వీడియోలో ఆమె ఇంకా అనేక రకాల చిట్కాలను వివరించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఐడియా భలే ఉందే’’.. అంటూ కొందరు, ‘‘అవును మీరు చెప్పింది నిజమే’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రైల్వే ప్లాట్‌ఫామ్ పైనే ప్రేమాయణం.. జంట వికృత చేష్టలకు అవాక్కయిన ప్రయాణికులు..