Viral Video: ఆమ్లెట్ వేస్తున్నాడనుకుంటే పొరపాటే.. గుడ్డు నుంచి బయటకు తీస్తున్నదేంటో చూస్తే.. మైండ్ బ్లాకవ్వాల్సిందే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 09:43 AM
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాక్కూడా జరుగుతుందా.. అని అనిపిస్తుంటుంది. అలాంటి..
సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో వివిధ రకాల జీవులకు సంబంధించిన వీడియోలు తెగ హల్‌చల్ చేస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాక్కూడా జరుగుతుందా.. అని అనిపిస్తుంటుంది. అలాంటి ఆశ్చర్యకర ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి గుడ్డు పగులగొట్టడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద బకెట్‌లో గుడ్లు (Eggs) నింపుకొని కూర్చుని ఉంటాడు. తర్వాత వాటిలో ఓ గడ్డును చేతిలోకి తీసుకుంటాడు. గుడ్డును పగులగొట్టి ఆమ్లెట్ వేసిన తరహాలో ఒక్కో్ గుడ్డును చేతిలోకి తీసుకుని పగులగొడతాడు. అయితే గుడ్డును పగులగొట్టగానే లోపల సొనకు బదులుగా షాకింగ్ దృశ్యం కనిపించింది.
Viral Video: ఆహా.. తెలివంటే నీదేనయ్యా.. పోలీసులకు దొరక్కుండా ఈ లారీ డ్రైవర్ వాడిన ట్రిక్ చూస్తే..
గుడ్డును పగులగొట్టిన వెంటనే లోపలి నుంచి ఎలిగేటర్ పిల్ల (Alligator babies) పొడుచుకుంటూ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన ఎలిగేటర్ పిల్లను అతను మరో వ్యక్తి చేతిలోకి అందించాడు. అతను దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత బకెట్‌లో వేస్తు్న్నాడు. ఇలా ఆ వ్యక్తి గుడ్డుతో ఆమ్లెట్ వేసినంతా సులభంగా ఎలిగేటర్ పిల్లలను బయటికి తీయడం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఇలాంటి సీన్ ఇప్పుడే చూస్తున్నాం.. ఆశ్చర్యంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటే డైనోసార్ పిల్లల తరహాలో కనిపిస్తున్నాయి’’.. అంటూ మరికొందరు, ‘‘ఇది కార్టూన్ గుడ్లా.. లేక నిజమైన గుడ్లా.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 660కి పైగా లైక్‌లు, 95 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..