Share News

Viral Video: అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

ABN , Publish Date - Oct 12 , 2024 | 09:46 PM

సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు. ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు..

Viral Video: అందమైన అమ్మాయి బైకు ఆపిందని సంబరపడ్డాడు.. చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌కి అవాక్కయ్యాడు..

సోషల్ మీడియాలో వినోదానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో యువతులు చేసే విచిత్రమైన పనులకు సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పాల్సిన అవరసం లేదు. ఇలా షేర్ చేయగానే.. అలా వైరల్ అయిపోతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది యువతులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అందమైన అమ్మాయి బైకు ఆపడంతో యువకుడు సంబరపడ్డాడు. అయితే చివరకు ఆమె ఇచ్చిన ట్విస్ట్‌ తెలుసుకుని అవాక్కయ్యాడు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ అందమైన యువతి రోడ్డు పక్కన నిలబడి.. ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని ఎదురుచూస్తుంటుంది. ఇంతలో ఎదురుగా బైకు రావడం (young woman asks biker for lift) చూసి చేయి ఎత్తి లిఫ్ట్ అడుగుతుంది. అందమైన అమ్మాయి బైకు ఆపడం చూసి సదరు యువకుడు సంబరపడిపోయి బండిని ఆపుతాడు.

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..


అయితే ఇక్కడే ఆమె అతడికి పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. బైకు వెనుక ఆమె కూర్చోకుండా.. ఓ వృద్ధుడిని పిలిచి కూర్చోబెడుతుంది. అయితే ఇదంతా గమనించిన ఆ యువకుడు.. ఆమ్మాయే బైకుపై కర్చుందనే ఆనందంతో సంబరంగా డ్రైవ్ చేస్తుంటాడు. మధ్య మధ్యలో సడన్‌ బ్రేకులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే కాస్త దూరం వెళ్లిపోయాక.. అనుమానం వచ్చి బైకును ఆపి వెనక్కు చూస్తాడు. వెనుక వైపు అమ్మాయి బదులుగా తాతయ్య ఉండడం చూసి ఖంగుతింటాడు.

Viral Video: వామ్మో.. ఇదేం విన్యాసంరా బాబోయ్.. పామును నోట్లో పెట్టుకుని మరీ..


ఇలా ఆ యువతి అతడికి వినూత్నంగా షాక్ ఇచ్చింది. ఇదంతా వ్యూస్, లైకుల కోసం కావాలని చేసినా.. వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ యువతి భలే షాక్ ఇచ్చిందిగా’’.. అంటూ కొందరు, ‘‘పాపం అమ్మాయే అనుకుని ఊహల్లో తేలిపోయాడు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లు, 4 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఏనుగు శక్తి సరే.. యుక్తిని ఎప్పుడైనా చూశారా.. పనసపండును ఎలా తెంపిందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 12 , 2024 | 09:46 PM