Share News

Viral Video: ఈ వరుడు నక్క తోక తొక్కినట్టున్నాడే.. పెళ్లిలో వధువు కుటుంబం ప్రకటించిన బహుమతుల లిస్ట్ తెలిస్తే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 08:25 PM

ప్రస్తుతం చాలా మంది వివాహాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ వివాహ కార్యక్రమాల్లో ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇక...

Viral Video: ఈ వరుడు నక్క తోక తొక్కినట్టున్నాడే.. పెళ్లిలో వధువు కుటుంబం ప్రకటించిన బహుమతుల లిస్ట్ తెలిస్తే..

ప్రస్తుతం చాలా మంది వివాహాల నిర్వహణకు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడడం లేదు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు కూడా తమ వివాహ కార్యక్రమాల్లో ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇక ధనవంతువుల వివాహాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వరుడికి వధువు కుటుంబం ప్రకటించిన బహుమతు లిస్ట్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఈ వరుడు నక్క తోక తొక్కినట్టున్నాడే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన వివాహం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. వివాహ తంతు ముగిసిన అనంతరం మంటపంలోనే వధువు కుటుంబ సభ్యులు బహుమతుల లిస్ట్ చదివి వినిపించారు. ఆ బహుమతులు వరుసగా.. ఒక మెర్సిడెజ్ బెంజ్ కారు, ఒక పార్చూనర్ కారు (Mercedes Benz, Fortuner car), 1.25కేజీల బంగారు, 7కేజీల వెండి ఇలా అత్యంత ఖరీదైన వస్తువులను ప్రకటించారు.

Viral Video: ఈ పెద్దాయన చాలా అప్‌డేట్‌గా ఉన్నాడే.. వధూవరుల మధ్యలోకి వచ్చి ఎలాంటి సలహా ఇచ్చాడంటే..

ఈ లిస్ట్ చదవడం విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇది పెళ్లి కాదు.. వ్యాపారం’’.. అంటూ కొందరు, ‘‘ఇంత జరుగుతున్నా.. పోలీసులు ఎందుకు చర్య తీసుకోవడం లేదు’’.. అంటూ మరికొందరు, ‘‘కట్నం ఇవ్వడంతో పాటూ తీసుకోవడం కూడా నేరం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: గడ్డ కట్టే మంచులో పొగలు కక్కే కాఫీ.. వీళ్ల అతి తెలివి చూస్తే అవాక్కవకుండా ఉండలేరు..

Updated Date - Feb 13 , 2024 | 08:25 PM