Share News

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..

ABN , Publish Date - Jul 24 , 2024 | 07:07 PM

వివాహంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివిధ రకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు...

Viral Video: పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఏడుపు.. ఓదార్చిన స్నేహితులు.. కారణమేంటని విచారించగా..

వివాహంలో వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివిధ రకాలుగా ప్లాన్ చేస్తుంటారు. ఇంకొన్నిసార్లు అనుకోకుండా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వివాహానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపై వరుడి పక్కనే వధువు ఉన్నట్టుండి ఏడుపు మొదలెట్టింది. స్నేహితులు ఆమెను ఓదార్చి చివరకు కారణమేంటని విచారణంగా అసలు విషయం బయటపడింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ (marriage) వేడుకలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. దండలు మార్చుకున్న వధూవరులు వేదికపై సోఫాలో కూర్చుని ఉండగా.. అతిథులంతా వారితో ఫొటోలు దిగుతుంటారు. ఈ క్రమంలో ముసుగు తీసి, వరుడిని చూసిన వధువు ఒక్కసారిగా ముఖంపై చేతులు (bride started crying) పెట్టుకుని ఏడుపు మొదలెడుతుంది.

Viral Video: లిఫ్ట్‌లో షాకింగ్ అనుభవం.. డోరు తెరుచుకున్నా దిగలేక అవస్థలు.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు..


అదే సమయంలో వధూవరులకు అటూ ఇటూ కూర్చుని ఫొటోలు దిగుతున్న యువతులు.. వధువును చూసి షాక్ అవుతారు. అంతా ఆమె వద్దకు వెళ్లి ఓదార్చే ప్రయత్నం చేస్తారు. స్నేహితులంతా చుట్టూ చేరి ఆమెను ఓదార్చుతున్నా.. వధువు మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. వధువు ఏడుస్తుండడాన్ని చూసిన వరుడు మౌనంగా అలాగే ఉండిపోతాడు. వివాహ వేడుకలో వరుడిని చూసిన వధువు.. అతను నల్లగా ఉండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోయింది.

Viral: అమెజాన్ నుంచి ఒళ్లు గగుర్పొడిచే పార్సిల్.. బాక్స్ తెరిచి చూసి ఖంగుతిన్న యువతి..


తన జీవితంలోని ఇష్టం లేని భర్త రావడంతోనే ఇలా ఏడ్చినట్లు తెలిసింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వధువుకు చాలా పెద్ద కష్టం వచ్చిందే’’.. అంటూ కొందరు, ‘‘నిశ్చితార్థ సమయంలో చూడకుండానే ఎలా అంగీకరించినట్లు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 800కు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: అయ్యో పాపం.. పాము నుంచి పిల్లలను కాపాడుకునేందుకు ఈ తల్లి పక్షి తపన చూస్తే..

Updated Date - Jul 24 , 2024 | 07:29 PM