Share News

Viral Video: ఎద్దును చూసి కారు దిగి కర్ర పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 01 , 2024 | 09:57 AM

కొన్ని జంతువులు జానవాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు రోడ్లపైకి వెళ్లే జంతువులు వాహనదారులపై దాడులు చేస్తూ హల్‌చల్ చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి..

Viral Video: ఎద్దును చూసి కారు దిగి కర్ర పట్టుకున్న వ్యక్తి.. చివరకు ఏం జరిగిందో చూస్తే.. షాకవ్వాల్సిందే..

కొన్ని జంతువులు జానవాల్లోకి వెళ్లి బీభత్సం సృష్టించడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు రోడ్లపైకి వెళ్లే జంతువులు వాహనదారులపై దాడులు చేస్తూ హల్‌చల్ చేయడం కూడా చూస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై హల్‌చల్ చేస్తున్న ఎద్దును చూసి ఓ వ్యక్తి కారు దిగి చేతిలోకి కర్ర తీసుకున్నాడు. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సౌదీ అరేబియాలో (Saudi Arabia) జరిగినట్లుగా తెలుస్తోంది. రోడ్డు పైకి వచ్చిన (bull created havoc on the road) ఓ ఎద్దు హల్‌చల్ చేసింది. దీంతో వాహనదారులంతా దాన్ని చూసి భయంతో రోడ్డు పైనే నిలిచిపోయారు. అయినా ఎద్దు చాలా సేపు అక్కడే నిలబడి వాహనాలను కదలకుండా చేసింది. ఇంతలో ఓ వాహనంలోని వ్యక్తికి కోపం వచ్చి పెద్ద కర్ర తీసుకుని కారు దిగాడు. ఎద్దుపై దాడి చేయాలని భావించాడు.

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..


అయితే అతను కారు దిగి కర్ర పట్టుకోవడం చూసిన ఎద్దు మరింత రెచ్చిపోయింది. వేగంగా పరుగెడుతూ అతడి పైకి దాడికి దిగింది. ఎద్దు తన వైపు రావడాన్ని చూసిన ఆ వ్యక్తి భయంతో కారులోకి వెళ్లి డోరు వేసుకునేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కారు లోపలికి వెళ్లి డోరు వేసేలోగానే ఎద్దు కారు డోరు (bull hit a car) వద్ద బలంగా ఢీకొట్టింది. ఈ దెబ్బకు కారు చాలా దూరం వరకు ముందుకు వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటనతో అక్కడ ఆగి ఉన్న వాహనదారులు మరింత భయపడ్డారు. వాహనాలను కదిలిస్తే.. ఎక్కడ తమపై దాడి చేస్తుందో అని మరింత భయపడ్డారు.

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..


వాహనాల్లో నుంచి బయటికి వచ్చే సాహసం ఎవరూ చేయలేదు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. ఈ ఎద్దు మొత్తానికి రచ్చరచ్చ చేసిందిగా’’.. అంటూ కొందరు, ‘‘ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుందేమో’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..

Updated Date - Aug 01 , 2024 | 09:58 AM