Share News

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..

ABN , Publish Date - Aug 01 , 2024 | 08:45 AM

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కళ్ల ముందు ఎలాంటి వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అయిపోతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా...

Viral Video: విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లగా వింత శబ్ధాలు.. ఏంటా అని పక్కకు తొలగించి చూడగా.. ఒక్కసారిగా..

ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కళ్ల ముందు ఎలాంటి వింత ఘటన చోటు చేసుకున్నా ఇట్టే వైరల్ అయిపోతోంది. వాటిలో కొన్ని వీడియోలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. ప్రధానంగా జంతువులు, విష సర్పాలకు సంబందించిన ఘటనలు వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వంటింట్లో వంట చేద్దామని వెళ్లగా విద్యుత్ స్టవ్‌ కింద నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఏంటా అని పరిశీలించడగా చివరికి షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వంటింట్లో విద్యుత్ స్టవ్‌పై వంట చేయాలని వెళ్లాడు. తీరా స్టవ్ ఆన్ చేయగానే దాని కింద నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. దీంతో ఏంటా అని కనుక్కునేందుకు స్టవ్‌ను పక్కకు తొలగించాడు. దీంతో దాని కింద నుంచి (snake came out from electric stove) ఓ నాగుపాము బుసలుకొడుతూ బయటికి వచ్చింది.

Viral Video: నిద్రపోతున్న మహిళ జుట్టులోకి దూరిన పాము.. చివరకు..


పామును చూడగానే అతను షాక్‌తో పక్కకు వెళ్లిపోయాడు. స్టవ్ నుంచి బయటికి వచ్చిన నాగుపాము (Cobra) బుసలు కొడుతూ అతన్ని కాటేయడానికి ప్రయత్నించింది. ఇలా చాలా సేపు ఆ పాము అక్కడే ఉంటూ ఎవరినీ స్టవ్ దగ్గరికి రాకుండా అడ్డుకుంది. ఇలాంటి ఘటనలు ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో ఇలాంటి అనేక ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. కొన్నిసార్లు ఇంటి తలుపు తీయగా పాము బుసలు కొడుతూ వస్తుంది.

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..


అలాగే ఫ్రిడ్జిలు, కూలర్ల కింద నుంచి, వెనుక నుంచి ఊహించిన విధంగా పెద్ద పెద్ద పాములు బయటికి రావడం చూశాం. తాజాగా, వంటింట్లో కనిపించిన పాము వీడియో చూసి నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పాము విద్యుత్ స్టవ్‌కు కాపాలగా ఉన్నట్టుంది’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో.. చూస్తుంటనే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పేరుకే ఎలిగేటర్.. ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..

Updated Date - Aug 01 , 2024 | 08:45 AM