Share News

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..

ABN , Publish Date - Jul 31 , 2024 | 09:10 PM

సైకిళ్లు, బైకులు, కార్లు తదితర వాహనాలపై కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అందరికీ పనికొచ్చేవి అయితే.. మరికొన్ని కేవలం వ్యూస్, లైక్‌ల కోసం చేస్తుంటారు. ఏదేమైనా ఇలాంటి వీడియోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. సైకిల్ హ్యాండిల్‌కు..

Viral Video: కారు మైలేజీ పెంచేందుకు ఇంజిన్‌లో ఇతను చేసిన మార్పు చూస్తే.. మతిపోవాల్సిందే..

సైకిళ్లు, బైకులు, కార్లు తదితర వాహనాలపై కొందరు చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. వీటిలో కొన్ని ప్రయోగాలు అందరికీ పనికొచ్చేవి అయితే.. మరికొన్ని కేవలం వ్యూస్, లైక్‌ల కోసం చేస్తుంటారు. ఏదేమైనా ఇలాంటి వీడియోలు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. సైకిల్ హ్యాండిల్‌కు బైకు హ్యాండిల్ తగిలించడం, బైక్‌కు బస్సు గేర్ అమర్చడం వంటి వినూత్న ప్రయోగాల వీడియోలను చూశాం. తాజాగా, ఇలాంటి విచిత్రమైన ప్రయోగానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కారు మైలేజీ పెంచేందుకు ఓ వ్యక్తి ఇంజిన్‌లో చేసిన మార్పు చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఎలాగైనా ఏదోటి చేసి తన కారు మైలేజీ వేగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం వివిధ రకాలుగా ఆలోచించాడు. అయితే చివరకు ఓ విచిత్ర నిర్ణయం తీసుకున్నాడు. కారు ఇంజిన్‌ను తీసేసి.. చివరకు ఆ స్థానంలో (man fitted bike engine to car) బైక్ ఇంజిన్‌ను అమర్చాడు. బైక్ ఇంజిన్‌ నుంచి కనెక్షన్ ఇచ్చి చక్రాలు తిరిగేలా ఏర్పాట్లు చేశాడు.

Viral Video: నీటి గుర్రం పవరేంటో తెలీక ఒక్కసారిగా చుట్టుముట్టిన సింహాలు.. చివరకు ఏమైందంటే..


ఇంజిన్ ఏర్పాటు పనులన్నీ పూర్తి చేశాక.. చివరగా టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేశాడు. అయితే కారును ఇలా స్టార్ చేయగానే రయ్యిన దూసుకెళ్లాల్సింది పోయి తాబేలులా నత్తనడకన వెళ్తోంది. ఈ కార వేగం చూసి అక్కడున్న వాళ్లంతా అవాక్కయ్యారు. ఇలా బైక్ ఇంజిన్‌‌తో కారును స్టార్ట్ చేశాడు గానీ.. ఆ కారు సైకిల్ కంటే నెమ్మదిగా వెళ్లడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు.

Viral Video: పేరుకే ఎలిగేటర్..ఈ యువతి చేయి వేయగానే.. ఏం చేసిందో చూడండి..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు’’.., ‘‘మైలేజీ 50 వస్తుందేమో గానీ.. స్పీడ్ అయితే మాత్రం గంటకు 5 కిలోమీర్లు’’.., ‘‘యావరేజ్ 50 liter/km. స్పీడ్ 10 km/years’’.., ‘‘హీరో సుజికీ స్లెండర్ BS7’’.., ‘‘సంవత్సరాలనికి 40 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది’’.., ‘‘ఈ కారు కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే నడుస్తుంది, తర్వాత నడవదు’’.. అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 45 వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నీటిలో నుంచి ఒడ్డుకు చేరుకున్న జాగ్వార్.. సడన్‌గా తోక పట్టుకున్న మొసలి.. చివరకు..

Updated Date - Jul 31 , 2024 | 09:10 PM