Viral Video: ఇదెక్కడి ప్రేమరా నాయనా.. పక్కా ప్లాన్ ప్రకారం స్నేహితులను పిలిపించి మరీ..
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:48 PM
ప్రేమికుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ప్రేమికుల ప్రవర్తన మరింత విచిత్రంగా మారిపోతోంది. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, ఏకంగా...
ప్రేమికుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియాలో యుగంలో ప్రేమికుల ప్రవర్తన మరింత విచిత్రంగా మారిపోతోంది. బహిరంగ ప్రదేశాల్లో ముద్దులు పెట్టుకోవడం, ఏకంగా బస్సులు, రైళ్లలో సరసాలు సాగించడం ఇటీవల ఎక్కువైంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ లవ్ ప్రపోజ్ వీడియో నెటిజన్లను అవాక్కయ్యేలా చేస్తోంది. ఓ యువకుడు తన ప్రియురాలికి వినూత్న రీతిలో లవ్ ప్రపోజ్ చేశాడు. ప్లాన్ ప్రకారం స్నేహితులను పిలింపించి మరీ తన ప్రేయసికి షాక్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన వీడియో (Lovers Viral Video) తెగ వైరల్ అవుతోంది ఈ ఘటన కొలంబియాలో చోటు చేసుకుంది. ఓ యువతి ఆమె ప్రియుడితో కలిసి కారులో వెళ్తుండగా.. కొందరు యువకులు ఎదురుగా వెళ్లి వాహనాన్ని ఆపేస్తారు. తుపాకీ చూపించి వారిని బెదిరిస్తారు. వారిని చూడగానే యువతి భయపడిపోతుంది. తర్వాత ప్రేమికులిద్దరినీ రోడ్డు మధ్యలోకి నడిపించుకుంటూ తీసుకొస్తారు. ఈ క్రమంలో యువతి తన ప్రాణాల మీద కూడా ఆశ వదులుకుంటుంది. తీరా రోడ్డు మధ్యలోకి తెచ్చిన తర్వాత వారి ప్లాన్ బయటపెట్టేస్తారు.
Viral Video: సింహానికి చిక్కిన గేదెల మంద.. దొరికిపోతాయనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ రివర్స్..
అంతవరకూ భయపడుతూ ఉన్న యువకుడు.. ఒక్కసారిగా చేతిలో పువ్వుతో ఆమెకు లవ్ ప్రపోజ్ (Love proposal) చేస్తాడు. ఊహించని ఈ పరిణామానికి ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ‘‘నన్ను ఎంతలా భయపెట్టావ్’’.. అని తన ప్రియుడిని చేత్తో కొడుతూ, నవ్వుతూ కౌగిలించుకుంటుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Viral Video: వామ్మో! వీడు మామూలోడు కాదు.. ఏ బ్రాండ్ తాగాడో గానీ.. చివరకు సింహాన్నే వణికించేశాడుగా..