Share News

Viral Video: మీ తెలివి సల్లగుండ.. కష్టపడుతున్నారనుకుంటే.. ఇదా మీరు చేసేది..

ABN , Publish Date - Dec 06 , 2024 | 07:17 PM

కొందరు అమాకత్వంతో చేసే పనులు చూసినప్పుడు.. అయ్యో పాపం.. అని అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొందరు తెలిసీ తెలియక చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది..

Viral Video: మీ తెలివి సల్లగుండ.. కష్టపడుతున్నారనుకుంటే.. ఇదా మీరు చేసేది..

కొందరు అమాకత్వంతో చేసే పనులు చూసినప్పుడు.. అయ్యో పాపం.. అని అనిపిస్తుంటుంది. అలాగే ఇంకొందరు తెలిసీ తెలియక చేసే పనులు చూస్తే తెగ నవ్వు వస్తుంటుంది. ఇలాంటి చిత్రవిచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొందరు కూలీలు కలిసి లారీ మూటలు మోస్తున్నారు. అయితే వారు పని చేస్తున్న విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన వారంతా.. ‘‘మీ తెలివి సల్లగుండ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ లారీలో కొందరు కూలీలు కలిసి బస్తాలను (Laborers loading sacks) లోడ్ చేస్తుంటారు. కూలీలు బస్తాలు లోడ్ చేయడంలో విచిత్ర ఏముందీ.. అని అనుకుంటున్నారా.. వాళ్ల లోడ్ చేసే విధానమే ఇప్పుడు వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఇద్దరు కూలీలు మూటను పైకి ఎత్తి మరో వ్యక్తి తలపై పెడుతున్నారు.

Viral Video: ఒళ్లు గగుర్పొడిచే సీన్.. జాయింట్ వీల్‌ నుంచి జారిన యువతి.. చివరకు ఏం జరిగిందంటే..


అతను ఆ మూటను దూరంగా మోసుకెళ్తాడేమో అనుకుంటే.. అందుకు విరుద్ధంగా అక్కడే కింద వరసగా పేరుస్తున్నాడు. ఇలా ఆ ఇద్దరూ కలిసి మూటలను పక్కనే ఉన్న ఇద్దరి తలపై పెడుతంటే.. వారేమో వెంటనే ఆ మూటలను ఆ పక్కన పడేస్తున్నారు. ఇద్దరు చేయాల్సిన పనిని నలుగురు చేస్తుండడాన్ని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: తల్లిదండ్రుల నిర్లక్ష్యానికి లైవ్ ఎగ్జాంపుల్.. లిఫ్ట్‌లోకి వెళ్లిన చిన్నారి.. చివరకు జరిగింది చూస్తే..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వీళ్ల తెలివి సల్లగుండా.. చాలా గొప్ప పని చేస్తున్నారే’’.. అంటూ కొందరు, ‘‘తెలిసి చేస్తున్నారా లేక తెలీక చేస్తున్నారా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 330కి పైగా లైక్‌లు, లక్షకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఖడ్గమృగంతో అంత ఈజీ కాదు.. సింహాల పరిస్థితి చివరకు ఏమైందంటే..


ఇవి కూడా చదవండి..

Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..

Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..

Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..

Viral Video: రికార్డ్ కాకపోయుంటే ఎవరూ నమ్మరేమో.. ఎదురెదురుగా ఢీకొన్న స్కూటీ, కారు.. వీడియోను స్లోమోషన్‌లో చూడగా..

Viral Video: ఈమె తెలివి తెల్లారిపోనూ.. దారి మధ్యలో నీళ్ల పైపును చూసి ఏం చేసిందంటే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 06 , 2024 | 07:17 PM