Share News

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..

ABN , Publish Date - Aug 20 , 2024 | 04:02 PM

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. కొందరైతే ఫోన్ మాయలో పడి ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలను కొనితెచ్చుకోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి..

Viral Video: మ్యాగీ చేస్తూ ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపిన వ్యక్తి. కాసేపటి తర్వాత స్టవ్‌పై చూడగా..

ప్రస్తుత స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ చాలా మంది స్మార్ట్ ఫోన్‌కు ఎడిక్ట్ అవుతున్నారు. కొందరైతే ఫోన్ మాయలో పడి ఏం చేస్తున్నారో వారికే తెలీనంతగా మారిపోతున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రమాదాలను కొనితెచ్చుకోవడం కూడా చూస్తున్నాం. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధిచిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మ్యాగీ చేస్తూ మరోవైపు ఫోన్‌లో ప్రియురాలితో మాటలు కలిపాడు. కాసేపటి తర్వాత వెనక్కు తిరిగి స్టవ్‌‌పై చూడగా షాకింగ్ సీన్ కనిపించింది.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు స్టవ్‌పై మ్యాగీ (Maggi) చేసుకోవాలని అన్నీ సిద్ధం చేసుకున్నాడు. ఇందుకోసం మ్యాగీ ప్లాకెట్లు, పాత్ర తదితరాలను సిద్ధం చేసుకుని వంట స్టార్ట్ చేశాడు. పాత్రలో నూడుల్స్ వేసి మంట పెట్టాడు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టవ్‌పై మ్యాగీ వేసి మంట పెట్టిన యువకుడు.. ఫోన్‌లో తన ప్రియురాలితో మాటలు కలిపాడు.

Viral Video: దాడి చేసిన పులిని.. చివరకు చిన్న ట్రిక్‌తో ఈ బాతు ఎలా ఫూల్ చేసిందంటే..


స్టవ్ వద్ద నిలబడ్డ అతను.. వెనక్కు తిరిగి ఫోన్‌‌లో గంటలు గంటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఓ వైపు సిగ్గుపడుతూ మరో వైపు ఫోన్‌కు ముద్దులు పెడుతూ.. ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. చాలా సేపు ఇలా మాట్లాడాక మధ్యలో వెనక్కు తిరిగి స్టవ్ మీద ఉన్న పాత్ర వైపు చూశాడు. అప్పటికే ఆ పాత్ర మధ్యలో (cooking pot burnt on the stove) కాలిపోయి మంట కనిపిస్తోంది. దీంతో పాటూ పాత్రలో ఉన్న న్యూడిల్స్ కూడా కాలిపోయాయి. దీంతో ఆ యువకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై మహిళ పక్కనే కూర్చున్న పోలీసు.. నిద్రపోయినట్లు నటిస్తూనే అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..


స్టవ్ మీద ఉన్న పాత్ర పైకి ఎత్తి చూడగా.. దాని మధ్యలో పెద్ద హోల్ పడిపోయింది. ‘‘ఫోన్‌ మాయలో పడడం వల్ల ఎంత ఘోరం జరిగింది’’.. అనుకుంటూ షాక్ అవుతాడు. చూస్తుంటే ఇదంతా వ్యూస్, లైక్‌ల కోసం కావాలని చేసినట్లుగా ఉన్నా కూడా వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదంతా వ్యూస్ కోసం చేసినా చాలా ఫన్నీగా ఉంది’’.. అంటూ కొందరు, ‘‘అమ్మాయిల పవర్ అలాంటిది మరి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 20 , 2024 | 04:03 PM