Share News

Viral Video: దాడి చేసిన పులిని.. చివరకు చిన్న ట్రిక్‌తో ఈ బాతు ఎలా ఫూల్ చేసిందంటే..

ABN , Publish Date - Aug 18 , 2024 | 09:08 PM

పులులు, సింహాలను చూసి జంతువులన్నీ భయపడుతుంటాయి. వాటి చప్పుడు వినపడగానే కంటికి కనిపించనంత దూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు వాటికి దొరికిన సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రయత్నించి, చివరకు ఎలాగోలా బయటపడుతుంటాయి. ఇలాంటి...

Viral Video: దాడి చేసిన పులిని.. చివరకు చిన్న ట్రిక్‌తో ఈ బాతు ఎలా ఫూల్ చేసిందంటే..

పులులు, సింహాలను చూసి జంతువులన్నీ భయపడుతుంటాయి. వాటి చప్పుడు వినపడగానే కంటికి కనిపించనంత దూరం పారిపోతుంటాయి. కొన్నిసార్లు వాటికి దొరికిన సందర్భాల్లో వివిధ రకాలుగా ప్రయత్నించి, చివరకు ఎలాగోలా బయటపడుతుంటాయి. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. పులి దాడి నుంచి బాతు ఎంతో తెలివిగా తప్పించుకున్న వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. వేట కోసం ఎదురుచూస్తున్న ఓ పులికి ఓ చిన్న బాతు కనిపిస్తుంది. దీంతో దాన్ని చంపేందుకు (tiger trying to attack a duck) వెనుకే వెళ్తుంది. వెనుకే పులి రావడాన్ని గమనించిన బాతు.. తన బుర్రకు పదునుపెడుతుంది. ఉన్నట్టుండి నేలపై చనిపోయినట్లు పడుకుండిపోతుంది. దీంతో పులి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Viral Video: గుడ్లపై కన్నేసిన బబూన్లు.. తరిమికొట్టాలని చూసిన పక్షులు.. చివరకు చూస్తుండగానే..


పడిపోయిన ఉన్న బాతును చూసి ‘‘అరే.. ఇది చచ్చిపోయినట్లుందే.. సరే పక్కకు తీసుకెళ్లి తీరిగ్గా తినేద్దాం’’.. అని అనుకుంటూ దాన్ని నోట కరుచుకుని కాస్త పక్కకు తీసుకెళ్తుంది. పడుకున్న తర్వాత నోటిలో ఉన్న బాతును నేలపై పడేస్తుంది. ఆ తర్వాత బాతును వాసన చూస్తూ మరోసారి పరిశీలిస్తుంది. అయితే ఈ క్రమంలో బాతు అలెర్ట్ అవుతుంది. ఒక్కసారిగా పైకి లేచి అక్కడి నుంచి తుర్రుమంటుంది.

Viral Video: ప్లాట్‌ఫామ్‌పై మహిళ పక్కనే కూర్చున్న పోలీసు.. నిద్రపోయినట్లు నటిస్తూనే అతడు చేస్తున్న నిర్వాకం చూస్తే..


బాతు పారిపోవడం చూసి అప్పటిదాకా ఎంతో ఆశగా ఉన్న పులి.. ‘‘ఓర్నీ.. దీని వేషాలు మామూలుగా లేవే.. ఎంత బాగా యాక్టింగ్ చేసింది.. చివరకు ఈ పిల్ల బాతు ముందు ఫూల్ అయ్యానుగా’’.. అనుకుంటూ అలాగే చూస్తుండిపోతుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ బాతు నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే’’.. అంటూ కొందరు, ‘‘పులినే ఫూల్ చేసిన బాతు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 4.8 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..


ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..

Viral Video: వామ్మో.. రైల్లో ఈమె చేస్తున్న నిర్వాకం చూస్తే మతిపోవాల్సిందే.. యువతుల వద్దకు వెళ్లి మరీ..

Viral Video: భూమిలో తవ్వుతుండగా బయటపడ్డ మట్టి కుండ.. లోపల ఏముందా అని చూడగా..

Viral Video: బాతు పవరేంటో తెలీక దాడికి దిగిన పులి.. సమీపానికి రాగానే షాకింగ్ సీన్..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 09:51 PM