Share News

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

ABN , Publish Date - Aug 18 , 2024 | 03:46 PM

మరణానికి ముందు యుముడు హెచ్చరికలు పంపిస్తాడో లేదో తెలీదు గానీ.. కొన్నిసార్లు కళ్లముందు ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయినా చాలా మంది నిర్లక్ష్యం చేసి చివరకు చావును కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు...

Viral Video: యముడు హెచ్చరించడమంటే ఇదేనేమో.. చావుకు క్షణాల ముందు షాకింగ్ సీన్..

మరణానికి ముందు యుముడు హెచ్చరికలు పంపిస్తాడో లేదో తెలీదు గానీ.. కొన్నిసార్లు కళ్లముందు ప్రమాద సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అయినా చాలా మంది నిర్లక్ష్యం చేసి చివరకు చావును కొని తెచ్చుకుంటుంటారు. ఇంకొందరు సెల్ఫీల పేరుతో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రాణాలు పోగొట్టుకుంటుంటారు. ఇలాంటి విచిత్ర ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మరణానికి ముందు ఓ వ్యక్తికి షాకింగ్ సీన్ కనిపించింది. అప్పటికీ అతను నిర్లక్ష్యం చేశాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమంయంలో సమీపానికి వెళ్లకూడదనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరు మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా బీచ్‌లో (beach) ఎంజాయ్ చేస్తూ చివరకు ప్రాణాలు పొగొట్టుకోవడం తరచూ చూస్తూనే ఉంటాం. అయినా చాలా మంది అదే తప్పు చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు.

Viral Video: గుర్రం డెక్కల పవర్ మూమూలుగా లేదుగా.. పాపం ఈ ఎలిగేటర్ పరిస్థితి చివరకు..


తాజాగా, ఓ వ్యక్తి కూడా ఇలాగే చేశాడు. సముద్రంలో అలల తాకిడి ఎక్కువగా ఉందని తెలిసినా బీచ్‌లోకి వెళ్లాడు. వెళ్లినవాడు దూరం నుంచి చూసి వెనక్కు రాకుండా.. ఏకంగా వాటి సమీపానికి వెళ్లాడు. సముద్రం అలలు అంచున ఉన్న పెద్ద బండరాళ్లపైకి వస్తున్నాయి. అయినా ఆ వ్యక్తి అదే బండరాళ్లపై నిలబడి ఎంజాయ్ చేస్తున్నాడు. ఇవే అతడి జీవితానికి చివరి క్షణాలని గుర్తించలేకపోయాడు. అతను అలా నిలబడి ఉండగా.. ఓ పెద్ద అల వచ్చి మీద పడింది.

Viral Video: పాదచారికి లిఫ్ట్ ఇచ్చిన బైకర్.. తీరా మార్గ మధ్యలో ఊహించని ట్విస్ట్.. చివరకు..


చూస్తుండగానే ఆ నీటిలో అతను కొట్టుకుపోయి బండ రాయి మీద నుంచి (young man was swept away in large sea wave) ఒక్కసారిగా సముద్రంలోకి పడిపోయాడు. ఈ ఘటన మొత్తం దూరంగా ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అక్కడికి వెళ్తే చనిపోవడం ఖాయమని తెలుస్తున్నా కూడా అతను అలాగే నిలబడడం దారుణం’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి సమయల్లో సముద్రం ఒడ్డుకు వెళ్లకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: పామును మింగిన కొండచిలువ.. కాసేపటి తర్వాత దిమ్మతిరిగే సీన్.. చివరకు..


ఇవి కూడా చదవండి

Viral Video: హాయిగా పడుకుందామని వెళ్లాడు.. మంచం కింద నుంచి శబ్ధాలు రావడంతో.. పరుపు తీసి చూడగా..

Viral Video: లోయలో అందమైన రీల్ చేయాలని చూశాడు.. రెండు అడుగులు వేయగానే..

Viral Video: పుస్తకాల లోడుతో వెళ్తున్న వ్యక్తి.. అనుమానం వచ్చి మొదటి పేజీ తీసి చూడగా.. షాకింగ్ సీన్..

Viral Video: ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా.. ఇండికేటర్ పాడవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 03:46 PM