Share News

Viral Video: బాలికలకు షాకింగ్ అనుభవం... చిరుతిళ్లు తింటుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా..

ABN , Publish Date - May 18 , 2024 | 07:53 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు బాలికలు రోడ్డు పక్కన ఓ బెంచిపై కూర్చుని చిరుతిళ్తు తింటుంటారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండగా.. ఉన్నట్టుండి..

Viral Video: బాలికలకు షాకింగ్ అనుభవం... చిరుతిళ్లు తింటుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా..

జన సంచార ప్రదేశాల్లో జంతువులు బీభత్సం సృష్టించడం తరచూ చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉండడంతో ఇలాంటి షాకింగ్ ఘటనలు వీడియోల రూపంలో నెట్టింట్లోకి వచ్చి చేరుతున్నాయి. వీటిలో కొన్ని ఘటనలు చూస్తే.. ‘‘అయ్యో.. పాపం..!’’.. అని అనిపిస్తుంటుంది. బాలికలకు షాకింగ్ అనుభవం ఎదురైంది. చిరుతిళ్లు తింటుండగా ఉన్నట్టుండి రెండు ఆవులు దూసుకొచ్చాయి. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ముగ్గురు బాలికలు రోడ్డు పక్కన ఓ బెంచిపై కూర్చుని చిరుతిళ్తు తింటుంటారు. ముగ్గురూ సరదాగా మాట్లాడుకుంటూ సంతోషంగా ఉండగా.. ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దూరం నుంచి రెండు ఆవులు (cows) పోట్టాడుకుంటూ బాలికల (girls) వైపు వచ్చాయి. దగ్గరికి వస్తాయనగా వారిలో ఓ బాలిక వాటిని గమనించింది. అయితే అప్పటికే అవి వారి పైకి దూసుకొచ్చాయి. రెండు ఆవులూ పోట్లాడుకుంటూ బాలికలపై పడ్డాయి.

Viral Video: నదిలో కూర్చుని గిటార్ వాయిస్తున్న యువకుడు.. సడన్‌గా దగ్గరికి వచ్చిన కొండచిలువ.. చివరకు..


ఆవుల దాడిలో వారిలో ఓ బాలిక తప్పించుకోగా.. మిగతా ఇద్దరూ ఆవుల కింద పడ్డారు. చివరకు ఆ ఇద్దరిలో ఓ బాలిక తేరుకుని పక్కకు వెళ్లిపోతుంది. చివరకు ఓ బాలిక నేలపై పడిపోతుంది. అప్పటికే కంగారులో ఉన్న ఆవు.. ఆ బాలికను తొక్కే ప్రయత్నం చేస్తుంది. అక్కడే ఉన్న కొందరు అప్రమత్తమై ఆవులను పక్కకు తోలే ప్రయత్నం చేస్తారు. ఇంతలో ఓ వ్యక్తి సమీపానికి వచ్చి బాలికను పట్టుకుని పక్కకు లాగేస్తాడు. చివరకు రెండు ఆవులు పోట్లాడుకుంటూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాయి.

Viral Video: మహిళను చూడగానే ఎలుగుబంటి ఇలా చేసిందేంటీ.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


ఈ ఘటనలో ఇద్దరు బాలికలకూ గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇలాంటి ఘటనలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఆవులు, గేదెలు రద్దీ రోడ్ల పైకి రాకుండా చర్యలు తీసుకోవాలి’’.. అంటూ మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లి దుస్తుల్లో వేదికపైకి వచ్చిన ప్రియురాలు.. చివరికి వరుడు ఎదురుగా ఉండగానే..

Updated Date - May 18 , 2024 | 07:53 PM