Share News

Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..

ABN , Publish Date - May 17 , 2024 | 08:01 PM

విదేశీయులను గౌరవించడం మన సంస్కారం. అయితే కొందరు ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు కొందరు విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరికొందరు లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇటీవల...

Viral Video: విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. జనాల మధ్యలో ఓ వ్యక్తి లాగి మరీ..

విదేశీయులను గౌరవించడం మన సంస్కారం. అయితే కొందరు ఆకతాయిల కారణంగా కొన్నిసార్లు కొందరు విదేశీ మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. మరికొందరు లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇటీవల చాలా మంది విదేశీ యువతులకు ఇలాంటి అనుభవం ఎదురవడం చూస్తూనే ఉన్నాం. గతంలో రాజస్థాన్‌లోని పెట్రోల్ బంకు సిబ్బంది.. రష్యన్ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం అందరికీ తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే తాజాగా, కేరళలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తిరునాళ్లలో వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో విదేశీ యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. కేరళలో (Kerala) త్రిసూర్ పూరం పండుగను పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ట్రావెలర్ అయిన ఓ విదేశీ యువతి త్రిసూర్ పండుగను, ఇక్కడి సాంప్రదాయాలు, భక్తలు అభిప్రాయాలను తెలుసుకుంటూ వీడియో తీస్తూ ఉంది. ఈ క్రమంలో ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. పండుగ గురించి తిరునాళ్లలో చాలా మంది తమ అభిప్రాయాలు తెలియజేస్తున్న క్రమంలో 50 ఏళ్ల వ్యక్తి మాట్లాడుతున్నాడు. దీంతో సదరు యువతి మైకు పట్టుకుని అతడికి సమీపంగా నిల్చుని ఉంటుంది.

Viral Video: ఇదెక్కడి క్రియేటివిటీరా నాయనా..! బియ్యం బస్తాపై ఇలాంటి ప్రయోగం కూడా చేయొచ్చా..


యువతిని మొదటి నుంచీ గమనిస్తున్న అతను.. మాట్లాడుతూ మాట్లాడుతూ చివరలో ఆమెను (man trying to kiss foreign girl) ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె తలపై చేయి పెట్టి.. దగ్గరికి లాగి ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే అతడి ప్రవర్తనను గమనించిన యువతి.. అతడి నుంచి దూరంగా వెళ్లిపోతుంది. అదే సమయంలో అక్కడే ఉన్న యువతి స్నేహితుడు.. ఆ వ్యక్తిని పక్కకు పంపిస్తాడు. ఆ వ్యక్తి ప్రవర్తనకు షాకైన యువతి.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Viral Video: ఏనుగు తొండాన్ని పట్టుకున్న మొసలి.. చివరకు ఎలా తప్పించుకుందో చూస్తే..


బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు సురేశ్ అలియాస్ మధును అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విదేశీయులను గౌరవించడం మన సాంప్రదాయం’‘.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి ప్రవర్తించడం తప్పు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 23వేలకు పైగతా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఎంత పెళ్లి అయితే మాత్రం మరీ ఇదేంటీ.. ఈ వరుడి డాన్స్ చూస్తే అవాక్కవ్వాల్సిందే..

Updated Date - May 17 , 2024 | 08:01 PM